Yoshitha Rajapaksa: అవినీతి కేసులో శ్రీలంక మాజీ దేశాధ్యక్షుడి కుమారుడు అరెస్టు
Yoshitha Rajapaksa: శ్రీలంక మాజీ దేశాధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషితా రాజపక్సను అరెస్టు చేశారు. ఓ ప్రాపర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజపక్స పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెలియట్టా ప్రాంతంలో తన స్వంత ఇంట్లో మాజీ నేవీ ఆఫీసర్ అయిన యోషితాను అదుపులోకి తీసుకున్నారు.
కొలంబో: అవినీతి కేసులో.. శ్రీలంక మాజీ దేశాధ్యక్షుడు మహింద రాజపక్స కుమారుడు యోషితా రాజపక్స(Yoshitha Rajapaksa)ను అరెస్టు చేశారు. ఓ ప్రాపర్టీ కొనుగోలు కేసులో యోషితా రాజపక్స పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెలియట్టా ప్రాంతంలో తన స్వంత ఇంట్లో మాజీ నేవీ ఆఫీసర్ అయిన యోషితాను అదుపులోకి తీసుకున్నారు. 2015 కన్నా ముందు.. తండ్రి మహింద రాజపక్స అధికారంలో ఉన్న సమయంలో.. యోషితా ఓ ప్రాపర్టీ కొనుగోలు విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మహిందకు ముగ్గురు కుమారులు ఉన్నారు. దాంట్లో యోషితా రెండో వ్యక్తి. ఇదే ప్రాపర్టీ అంశంలో మరో మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సను కూడా విచారించారు. తనకు సెక్యూర్టీ కల్పించాలని కోరుతూ ప్రాథమిక హక్కుల కింద మహింద రాజపక్స సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడిని అరెస్టు చేయడం శ్రీలంకలో సంచలనంగా మారింది.
గత ఏడాది నవంబర్లో అనుర కుమార దిశనాయకే.. శ్రీలంక అధ్యక్షుడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహింద పెద్ద కుమారుడు నమల్ రాజపక్సను కూడా మరో ప్రాపర్టీ కేసులో పోలీసులు విచారించారు. మహింద రాజపక్స పదివీకాలం.. 2005 నుంచి 2015 మధ్య.. ఎవరు అవినీతికి పాల్పడినట్లు తేలినా వాళ్లను అదుపులోకి తీసుకోనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

