David Cameron: బ్రిటన్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. సునాక్ క్యాబినెట్లోకి మాజీ ప్రధాని కెమరూన్
David Cameron: బ్రిటన్ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ప్రధాని రిషి సునాక్ తన నిర్ణయాలతో అందరికీ షాక్ ఇచ్చారు. ఎవరూ ఊహించనిరీతిలో మాజీ ప్రధాని డేవిడ్ కెమరూన్ను తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.
లండన్: బ్రిటన్ రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. ప్రధాని రిషి సునాక్ తీసుకున్న నిర్ణయం.. అందర్నీ షాక్‌కు గురిచేసింది. క్యాబినెట్‌ను మార్చిన సునాక్.. విదేశాంగ మంత్రిత్వశాఖను మాజీ ప్రధాని డేవిడ్ కెమరూన్(David Cameron)కు అప్పగించారు. ఊహించని పరిణామాలతో బ్రిటన్‌లో రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కెమరూన్.. 2010 నుంచి 2016 వరకు దేశ ప్రధానిగా చేశారు. ప్రధాని సునాక్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యక్తిగతంగా వ్యతిరేకించినా.. ప్రస్తుత ప్రధాని చాలా బలమైన, సమర్ధవంతమైన నేత అని కెమరూన్ అన్నారు.
హోంశాఖ మంత్రి సుయిల్లా బ్రెవర్మాన్‌ను ఇవాళ సునాక్ తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. అయితే విదేశాంగ మంత్రిగా ఉన్న జేమ్స్ క్లెవర్లీకి ఆ పోస్టును అప్పించారు. దీంతో ఖాళీ అయిన విదేశాంగ మంత్రిత్వశాఖను డేవిడ్ కెమరూన్‌కు అప్పగించారు. మాజీ ప్రధాని కెమరూన్.. మళ్లీ మంత్రి మండలిలోకి రావడాన్ని మాజీ ప్రధాని థెరిస్సా మే స్వాగతించారు. అంతర్జాతీయంగా కెమరూన్‌కు ఉన్న గుర్తింపు ప్రస్తుత అనిశ్చితి సమయంలో ఉపయోగపడుతుందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

