లాస్ ఏంజెల్స్: మీరు ఒక్క రాతి నిద్ర పోలేదా? అయితే మీ మెదడు రెండు, మూడేండ్లు వయస్సు పెరిగి పోయినదానిలా కనిపిస్తుంది! తాజా పరిశోధనలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది. జర్నల్ ఆఫ్ న్యూరో సైన్స్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా నిద్ర లేమితో బాధ పడిన వ్యక్తుల మెదళ్లను పరిశోధకులు పరిశీలించారు.
ఆ తర్వాత అదే వ్యక్తులు ఒక రాత్రంతా నిద్ర పోయినప్పుడు వారి మెదళ్లను పరిశీలించారు. నిద్ర లేమితో ఉన్నవారి మెదడులో కలిగిన మార్పులు వారు ఒకటి లేదా రెండేండ్లు పెద్దవారయ్యాక ఉన్న మెదడులాగా ఉండటం పరిశోధకులు గమనించారు.