ఆ రూట్లో మైన్లున్నాయి.. తరలింపు మార్గాలు అనైతికం..
కీవ్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని తరలించేందుకు రష్యా కొన్ని మార్గాలను ప్రకటించింది. ఆ కారిడార్లపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రూట్లన్నీ అనైతికంగా ఉన్నాయని ఉక్రెయిన్ వెల్లడించింది. ఉక్రెయిన్‌లో తలదాచుకుంటున్న వాళ్లు క్షేమంగా బయటపడేందుకు రష్యా కొన్ని మార్గాలను ప్రకటించింది. ఆ రూట్లను రష్యా ఆర్ఐఏ నోవోస్టీ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఆ రూట్లన్నీ రష్యా, బెలారస్‌కు దారి తీస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తున్నది. కీవ్ నుంచి తరలింపు రూటు బెలారస్‌కు వెళ్తున్నదని, ఇక ఖార్కివ్ నుంచి వస్తున్న కారిడార్ అది రష్యాకు వెళ్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మారిపౌల్, సుమీ నగరాల నుంచి కారిడార్ రూట్లు కూడా రష్యాకు దారి తీస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తున్నది.
రష్యా ప్రకటించిన తరలింపు రూట్ల పట్ల రెడ్ క్రాస్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పుల విరమణ రష్యా పాటించడం లేదని రెడ్ క్రాస్ తెలిపింది. మారిపౌల్ నుంచి బయటపడే మార్గాన్ని రష్యా చూపెట్టినా, ఆ రూట్లో అన్నీ మైన్లు ఉన్నాయని రెడ్ క్రాస్ వెల్లడించింది. అందుకే రెండు దేశాల మధ్య సరైన అవగాహన ఒప్పందం కుదరాలని రెడ్ క్రాస్ చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

