Toolbag Orbiting Earth | వ్యోమగాముల పట్టు నుంచి జారి.. భూమి చుట్టూ తిరుగుతున్న టూల్‌కిట్ బ్యాగ్
Toolbag Orbiting Earth | ప్రస్తుతం ఆకాశంలో కనిపిస్తున్న ఒక వింత వస్తువు అందరినీ ఆకట్టుకుంటున్నది. వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్‌కిట్ బ్యాగ్ భూమి చుట్టూ తిరుగుతున్నది. కొన్ని నెలల పాటు భూ కక్ష్యలో తిరిగే ఈ బ్యాగ్ 2024 మార్చిలో భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతుందని నాసా అంచనా వేసింది.
వాషింగ్టన్: ప్రస్తుతం ఆకాశంలో కనిపిస్తున్న ఒక వింత వస్తువు అందరినీ ఆకట్టుకుంటున్నది. వ్యోమగాముల పట్టు నుంచి జారిన టూల్‌కిట్ బ్యాగ్ భూమి చుట్టూ తిరుగుతున్నది. (Toolbag Orbiting Earth) నవంబర్ 1న నాసా మహిళా వ్యోమగాములు తొలిసారి స్పేస్‌వాక్ చేశారు. జాస్మిన్ మోఘ్బెలీ, లోరల్ ఓ’హారా కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు ఉన్న సోలార్ పరికరాలకు రిపేర్ చేశారు. ఈ సందర్భంగా ఒక టూల్‌కిట్ బ్యాగ్ వారి పట్టు నుంచి జారిపోయింది. ఐఎస్ఎస్కు చెందిన కెమెరాలో ఇది రికార్డైంది.
కాగా, మహిళా వ్యోమగాముల పట్టు నుంచి జారిపోయిన టూల్‌కిట్ బ్యాగ్ నాటి నుంచి భూమి చుట్టూ తిరుగుతున్నది. తెల్లని సంచి మాదిరిగా ఉన్న ఇది ఆకాశంలో మెరుస్తున్నది. బైనాక్యులర్స్ ద్వారా కూడా దీనిని చూడవచ్చు. గత వారం ఫుజి పర్వతంపై నింగిలో తేలుతున్న ఈ బ్యాగ్‌ను జపనీస్ వ్యోమగామి సతోషి ఫురుకావా గుర్తించారు.
మరోవైపు అంతరిక్షంలో ప్రకాశిస్తున్న ఈ టూల్‌కిట్ బ్యాగ్ ఐఎస్ఎస్ కంటే రెండు నుంచి నాలుగు నిమిషాలు ముందుగా భూమి చుట్టూ తిరుగుతున్నదని నాసా తెలిపింది. దీని వల్ల ఐఎస్ఎస్కు లేదా అందులోని సిబ్బందికి ఎలాంటి ముప్పు లేదని పేర్కొంది. కొన్ని నెలల పాటు భూ కక్ష్యలో తిరిగే ఈ టూల్‌కిట్ బ్యాగ్ 2024 మార్చిలో భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోతుందని అంచనా వేసింది.
Last seen by @Astro_Satoshi while floating over Mount Fuji 🗻 the 'Orbital Police' can confirm that the lost EVA gear is being tracked 🫡 https://t.co/wz4MITmAfM pic.twitter.com/eksfu9fPFw
— Dr Meganne Christian (@astro_meganne) November 5, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Astronauts
- Earth
- Escapes
- Grasp
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

