Elon Musk | అత్యంత ధనవంతుడిగా ఎలాన్ మస్క్.. 334.3 బిలియన్లకు పెరిగిన సంపద..!
Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద పెరిగింది. 334.3 బిలియన్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. టెస్లా షేర్లు పెరుగుదల నేపథ్యంలో ఆయన ఆదాయం మరింత పెరిగింది.
Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద పెరిగింది. 334.3 బిలియన్ డాలర్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. టెస్లా షేర్లు పెరుగుదల నేపథ్యంలో ఆయన ఆదాయం మరింత పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన విజయంతో మస్క్ షేర్లు పుంజుకున్నాయి. యూఎస్ ఎన్నికల తర్వాత టెస్లా షేర్లు ఏకంగా 40శాతం వరకు పెరిగాయి. కంపెనీ స్టాక్స్ శుకవారం 3.8శాతం లాభంతో 352.56 డాలర్ల వద్ద ముగిసింది. గత మూడేళ్లలో ఇంత స్థాయికి పెరగడం ఇదే తొలిసారి. స్టాక్స్ పెరుగుదల నేపథ్యంలో మస్క్ సంపద 7 బిలియన్లు పెరుగుదల నమోదైంది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌తో ఎలాన్ మస్క్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఈ క్రమంలో పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచింది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ ప్రచారం నిర్వహించారు. ఆయనకు 100 మిలియన్ డాలర్స్‌ని విరాళంగా అందించారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్.. మస్క్‌ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్‌గా నియమించారు. భారతీయ వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కలిసి ఈ హోదాలో పని చేయనున్నారు. ప్రస్తుతం ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 235.3 బిలియన్లతో ఒరాకిల్ చైర్మన్ లారీ ఎల్లిసన్ రెండోస్థానంలో ఉన్నారు. ఎల్లిసన్ కంటే 80 బిలియన్ల సంపదతో కుబేరుల జాబితాలో మస్క్ నెంబర్ వన్‌గా నిలిచారు. మస్క్ సంపదలో ఎక్కువ సంపద టెస్లా నుంచే వస్తున్నది. అయితే, చారిత్రాత్మకంగా ఆదాయం పెరిగినా.. టెస్లా షేర్లు 2021 చివరి మాసం తర్వాత ఆల్‌టైమ్ హై నుంచి 14శాతం వరకు తగ్గాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

