Twitter video app | స్మార్ట్ టీవీల కోసం త్వరలో ట్విటర్ వీడియో యాప్.. ఎలాన్ మస్క్ ప్రకటన
Twitter video app | స్మార్ట్ టీవీల కోసం ట్విటర్ వీడియో యాప్ అందుబాటులోకి రాబోతున్నది. స్మార్ట్ టీవీల కోసం త్వరలో ట్విటర్ వీడియో యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, ట్విటర్ ప్రణాళికల్లో వీడియో యాప్ ప్రస్తావన కూడా ఉన్నదని దాని యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు.
Twitter video app : స్మార్ట్ టీవీల కోసం ట్విటర్ వీడియో యాప్ అందుబాటులోకి రాబోతున్నది. ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని, ట్విటర్ ప్రణాళికల్లో వీడియో యాప్ ప్రస్తావన కూడా ఉన్నదని దాని యజమాని ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రకటించారు. ట్విటర్ ప్లాట్ఫామ్లో పెరుగుతున్న వీడియో కంటెంట్‌పై దృష్టి పెట్టడానికి కంపెనీ కొత్త ప్రణాళికలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు.
స్మార్ట్ టీవీల కోసం ట్విటర్ వీడియో యాప్ అవసరమంటూ S-M Robinson అనే ఓ ట్విటర్ యూజర్ చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. త్వరలో ట్విటర్ వీడియో యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. మీరు కోరుకుంటున్న యాప్ అతి త్వరలోనే రాబోతోంది అంటూ రాబిన్సన్కు ఎలాన్ మస్క్ రిప్లై ఇచ్చాడు. అందుకు ప్రతిగా రాబిన్సన్ మరో ట్వీట్ చేశాడు. ట్విటర్ వీడియో యాప్ అందుబాటులోకి వచ్చిన రోజు తాను యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేస్తానని, ఇక ఎప్పుడూ యూట్యూబ్ వైపు చూడనని ఆ ట్వీట్లో పేర్కొన్నాడు.
డిజిటల్ ప్రకటనలకు మించి సోషల్ మీడియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించబోతున్నట్టు కొత్త సీఈఓ లిండా యాకారినో, ఎలాన్ మస్క్.. గురువారం ఇన్వెస్టర్ ప్రజంటేషన్లో పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

