వాషింగ్టన్, ఏప్రిల్ 28: 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన టెస్లా సీఈవో ఎలాన్‌మస్క్ త్వరలో కోకాకోలాను కొనుగోలు చేసే యోచనలో ఉన్నట్టు పేర్కొన్నారు. కొకైన్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు కోకాకోలాను కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఆయన ఈ వ్యాఖ్యలు సరదాగానే చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. కోకాకోలాను కోకా ఆకులు, కోలా నట్స్‌తో తయారు చేస్తారు. అందుకే దానికి ఆ పేరు. కోకా ఆకులతో కొకైన్‌ను తయారుచేస్తారు. అయితే కొకైన్‌పై అమెరికాలో నిషేధం ఉండటంతో కోకాకోలా ఫార్ములాలో కొకైన్లేని కోకా ఆకుల్ని మాత్రమే ప్రస్తుతం వినియోగిస్తున్నారు. దీనిని ఉద్దేశించే.. మస్క్ సరదాగా కొకైన్‌ను తిరిగి తీసుకువస్తానంటూ ట్వీట్ చేశారని చెబుతున్నారు.