Elon Musk: ఎస్వీబీ బ్యాంక్ కొనుగోలుపై మస్క్ ఇంట్రెస్ట్
Elon Musk : ఎస్వీబీ బ్యాంక్‌ను కొనుగోలు చేయాలన్న ఐడియాను తాను స్వాగతిస్తున్నట్లు ఎలన్ మస్క్ తెలిపారు. ఆ బ్యాంక్ లావాదేవీలను అమెరికా ప్రభుత్వం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. రెగ్యులేటర్లు ఆ బ్యాంక్‌ను మూసివేశారు.
న్యూయార్క్: అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB)ను మూసివేసిన విషయం తెలిసిందే. ఆ బ్యాంక్ ఆస్తుల్ని సీజ్(assets seized) చేశారు. గ్రేట్ రిసెషన్ తర్వాత అమెరికాలో దివాళీ తీసిన అతిపెద్ద బ్యాంక్‌గా ఎస్వీబీ నిలిచింది. ఆ బ్యాంకులో డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన బిలియన్ల డాలర్లు స్తంభించిపోయాయి.
అయితే ఆ బ్యాంక్‌ను ట్విట్టర్(twitter) సంస్థ టేకోవర్ తీసుకోవాలని రేజర్ కంపెనీ సీఈవో(Razer CEO) మిన్ లియాంగ్ టాన్ కోరారు. తన ట్విట్టర్లో ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. రేజర్ హార్డ్‌వేర్ సంస్థ ఈసీవో చేసిన ప్రతిపాదనపై ఎలన్ మస్క్(Elon Musk) స్పందించారు. ఆ ఐడియాను తాను స్వాగతిస్తున్నట్లు మస్క్ తన ట్వీట్లో చెప్పారు.
I’m open to the idea
— Elon Musk (@elonmusk) March 11, 2023
ఎస్వీబీ బ్యాంకు స్టాక్స్ దారుణంగా పడిపోయాయి. ఆ కంపెనీ స్టాక్స్ 60 శాతం క్షీణించాయి. దీంతో అమెరికా ఫైనాన్స్ రెగ్యులేటరీ సంస్థ ఎస్వీబీపై చర్యలు తీసుకున్నది. స్టార్టప్‌లపై ఫోకస్ చేసే ఆ బ్యాంక్‌ను మూసివేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

