Elon Musk | ట్విట్టర్ కొత్త సీఈవో ఇతనే.. ప్రకటించిన మస్క్..!
ట్విట్టర్ కొత్త సీఈవోను పరిచయం చేశారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తన పెంపుడు కుక్క ఫోల్కీని ట్విట్టర్ సీఈవో సీట్లో కూర్చోబెట్టిన మస్క్.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తొడిగాడు. మస్క్ చేసిన ఈ పనికి నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Elon Musk | వివాదాస్పద నిర్ణయాలు, పోస్టులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు ట్విట్టర్ కొత్త బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్. తాజాగా మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. ఇందుకు కారణం ట్విట్టర్‌కు కొత్త సీఈవోను పరిచయం చేయడమే. ఇంతకీ ఆ కొత్త సీఈవో ఎవరనుకుంటున్నారు..? మస్క్ పెంపుడు కుక్క..!
తన పెంపుడు కుక్క ఫోల్కీ(pet dog Floki )ని ట్విట్టర్ సీఈవో సీట్లో కూర్చోబెట్టిన మస్క్.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తొడిగాడు. ‘ట్విట్టర్ కొత్త సీఈవో ఇతనే..’ అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాదు ‘ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్.. నెంబర్లలోనూ, స్టైల్లోనూ’ అంటూ పరోక్షంగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేశారు.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023
అయితే, మస్క్ చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ‘ముందు ట్విట్టర్ పని తీరుపై శ్రద్ధ పెట్టండి, మాజీ సీఈవోపై కాదు’, ‘పరాగ్ అగర్వాల్ నేతృత్వంలో ట్విట్టర్ అద్భుతమైన పనితీరు సాధించింది. మెరుగైన వృద్ధిని కనపరిచింది’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. ట్విట్టర్ మాజీ ఉద్యోగులు సైతం మాస్క్ చర్యను ఖండిస్తున్నారు. ‘రెచ్చగొట్టే వైఖరిని మస్క్ మానుకోవాలి’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. ప్రస్తుతం మస్క్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
He’s great with numbers! pic.twitter.com/auv5M1stUS
— Elon Musk (@elonmusk) February 15, 2023
And has 🔥🔥 style pic.twitter.com/9rcEtu9w1Z
— Elon Musk (@elonmusk) February 15, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

