కెనడా ప్రధాని ట్రుడోను హిట్లర్‌తో పోల్చిన ఎలన్ మస్క్
Hitler | టెస్లా అధినేత ఎలన్ మస్క్ కెనడా ప్రధాని ప్రధాని జస్టిన్ ట్రుడోను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు మద్దతు ప్రకటించిన ఎలన్ మస్క్
న్యూయార్క్: టెస్లా సీఈఓఎలన్ మస్క్ (Elon Musk) కెనడా ప్రధాని ప్రధాని జస్టిన్ ట్రుడోను అడాల్ఫ్ హిట్లర్‌తో పోల్చాడు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ట్రక్కు డ్రైవర్లకు మద్దతు ప్రకటించిన ఎలన్ మస్క్.. ట్రుడోను అభినవ హిట్లర్‌గా పేర్కొంటూ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై దుమారం రేగడంతో వెంటనే దానిని తొలగించాడు.

కెనడాలో ట్రక్కు డ్రైవర్లకు ట్రుడో ప్రభుత్వం వ్యాక్సిన్ తప్పనిసరి చేసింది. దీంతో వారు ఆందోళన బాటపడ్డారు. అమెరికా-కెనడా సరహద్దుల వద్ద పెద్దఎత్తున ట్రక్కులను నిలిపి ఆందోళన చేస్తున్నారు. వారికి టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గత నెలలోనే మద్దతు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి పీఎం ట్రుడోను హిట్లర్‌తో పోల్చుతు ట్విటర్లో పోస్టు చేశారు. అయితే ఎలాంటి వివరణ ఇవ్వకుండానే గురువారం మధ్యాహ్నం దానిని తొలగించారు.

టీకాను నిబంధనను ఎత్తివేయాలంటూ డ్రైవర్లు చేపట్టిన ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. అమెరికా కెనడా సరిహద్దులను ట్రక్కర్లు ముట్టడించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధాన రహదారులు, బ్రిడ్జిలపై ట్రక్కులను అడ్డంగా పెట్టడంతో దేశం స్తంభించిపోయింది. పరిస్థితులు అదుపు తప్పడంతో ప్రధాని ట్రుడో కెనడా మొత్తం ఎమర్జెన్సీ విధించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

