బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వడార్ చట్టబద్దత.. క్రిప్టో కరెన్సీతో ఇక లావాదేవీలు

శాన్ సాల్వడార్: బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వడార్ దేశం చట్టబద్దత కల్పించింది. ప్రపంచంలో క్రిప్టోకరెన్సీకి చట్టబద్దత కల్పించిన మొట్టమొదటి దేశంగా ఎల్ సాల్వడార్ నిలిచింది. ఇవాళ కాంగ్రెస్‌లో జరిగిన ఓటింగ్‌లో 62 ఓట్లు అనుకూలంగా పడ్డాయి. ఇక ఆ దేశంలో లావాదేవీల కోసం బిట్‌కాయిన్‌ను న్యాయబద్దంగా వాడుకోవచ్చు. బిట్‌కాయిన్ చట్టానికి ఆమోదం తెలుపుతూ ఆ దేశ ఉభయసభలు అనుకూలంగా ఓటేశాయి. బిట్‌కాయిన్ చట్టంపై ఓటింగ్‌కు వెళ్లాలంటూ అధ్యక్షుడు నయిబ్ బుక్లీ బుధవారం ఆ బిల్లును కాంగ్రెస్‌కు పంపారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా చట్టబద్దంగా బిట్‌కాయిన్ చెల్లింపులు జరగాలన్న ఉద్దేశంతో చట్టాన్ని రూపొందిచినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
ఇక నుంచి బిట్‌కాయిన్ రూపంలో ధరలను వెల్లడించనున్నారు. పన్నులను కూడా క్రిప్టో రూపంలో చెల్లించవచ్చు. ప్రభుత్వ ఆమోదం దక్కినా.. నిజానికి ఎల్ సాల్వడార్ దేశం ఎలా బిట్‌కాయిన్ లావాదేవీలను జరుపుతుందో ఇంకా స్పష్టం కావడం లేదు. అమెరికా డాలర్‌తో ఎక్స్చేంజ్ రేటును బిట్‌కాయిన్‌తో జరుపువచ్చు అని కొత్త చట్టం ప్రతిపాదించింది. ఎల్ సాల్వడార్లో అధికారికంగా యూఎస్ డాలర్‌ను కరెన్సీగా వాడుతున్నారు. బిట్‌కాయిన్ లావాదేవీల గురించి ప్రజలను చైతన్యపరచనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

