ఎక్కడైనా హైస్పీడ్ ఇంటర్నెట్!.. నేరుగా ఉపగ్రహాలతో మొబైల్ ఫోన్ల అనుసంధానం!
మొబైల్ ఫోన్లు నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానం అయ్యేందుకు అవకాశం కలిగించే కొత్త చిప్‌సెట్‌ను అభివృద్ధిపరచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాలో జరిగిన ఆల్-ఇన్ సదస్సులో మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు.
- చిప్సెట్స్ తయారు చేస్తున్న ఎలాన్ మస్క్ కంపెనీలు
- జియో, ఎయిర్టెల్ వంటి నెట్‌వర్క్‌లపై ఆధారపడనక్కర్లేదు
- రెండేళ్ల తర్వాత అందుబాటులోకి
న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్లు నేరుగా ఉపగ్రహాలతో అనుసంధానం అయ్యేందుకు అవకాశం కలిగించే కొత్త చిప్‌సెట్‌ను అభివృద్ధిపరచేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కాలిఫోర్నియాలో జరిగిన ఆల్-ఇన్ సదస్సులో మాట్లాడుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు. తన కంపెనీలైన స్పేస్ఎక్స్, స్టార్‌లింక్ ఉమ్మడిగా ఈ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిప్సెట్ సిద్ధం కావడానికి సుమారు రెండేళ్లు పడుతుందన్నారు.
ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల యూజర్లు తమ ఫోన్లపై వీడియోలను స్ట్రీమ్ చేసుకోవచ్చునని, నిరంతరాయంగా డాటాను వాడుకోవచ్చునని చెప్పారు. ఈ నవ కల్పన వల్ల టెలికం ఇండస్ట్రీ రూపురేఖలు మారుతాయని అభిప్రాయపడ్డారు. ఈ చిప్సెట్ అందుబాటులోకి వస్తే, ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా ప్రజలు తమ మొబైల్ ఫోన్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు.
జియో లేదా ఎయిర్టెల్ వంటి లోకల్ నెట్‌వర్క్‌లపై ఆధారపడవలసిన అవసరం ఉండదు. భూమిపైగల ఏ భాగం నుంచి అయినా బీమ్ ఇంటర్నెట్ కవరేజ్ సాధ్యమయ్యేలా ఉపగ్రహం అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం స్టార్‌లింక్ కిట్‌లో స్టార్‌లింక్ డిష్, వైఫై రౌటర్, పవర్ సప్లయ్ కేబుల్స్, మౌంటింగ్ ట్రైపాడ్ ఉంటున్నాయి. హైస్పీడ్ ఇంటర్నెట్ కావాలంటే, డిష్‌ను ఆరుబయట అమర్చవలసి ఉంటుంది. స్టార్‌లింక్ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్లలో అందుబాటులో ఉంది. సెటప్ నుంచి మానిటరింగ్ వరకు ప్రతి విషయాన్నీ ఈ యాప్ నిర్వహిస్తుంది. మస్క్ చెప్పిన కొత్త చిప్ అందుబాటులోకి వస్తే, స్టార్‌లింక్ కిట్ అవసరం ఉండదు. ఫలితంగా ఎక్కడి నుంచి అయినా హైస్పీడ్ ఇంటర్నెట్ను వినియోగించుకుని వీడియోలను చూడవచ్చు, ఆటలు ఆడవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

