Ebola Deaths | కాంగోలో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా.. 930 దాటిన మృతుల సంఖ్య..!
Ebola Deaths | మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో (Congo) ఎబోలా వైరస్ (Ebola Virus) వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 15 నుంచి శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2,344 కేసులు నమోదు కాగా.. దాదాపు 930 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ (Congo Health Ministry) తాజాగా వెల్లడించింది. శుక్రవారం నుంచి 24 గంటల వ్యవధిలో 37 మరణాలు నమోదైనట్లు తెలిపింది.
Ebola Deaths : మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో (Congo) ఎబోలా వైరస్ (Ebola Virus) వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 15 నుంచి శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2,344 కేసులు నమోదు కాగా.. దాదాపు 930 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ (Congo Health Ministry) తాజాగా వెల్లడించింది. శుక్రవారం నుంచి 24 గంటల వ్యవధిలో 37 మరణాలు నమోదైనట్లు తెలిపింది. ప్రస్తుతం కాంగోలో నమోదవుతున్న కేసులన్నీ బుండిబుగ్యో ఎబోలా రకానివే. ఈ తరహా కేసులు నమోదవుతున్నట్లు మే 15న అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఈ వైరస్‌ను అరికట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ అందుబాటులో లేవు. సాధారణంగా ఎబోలా వైరస్ జంతువులు, గబ్బిలాలకు సోకుతుంది. అది సోకిన జంతువులను వేటాడి వాటి మాంసం (బుష్మీట్) తినడంవల్ల మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించడానికి 21 రోజులు పడుతుంది. ఫ్లూ, మలేరియా, జ్వరం వంటి లక్షణాలు తొలుత కనిపించినా.. చివరకు అవయవాల వైఫల్యానికి దారితీసే ప్రమాదం ఉంది.
ఈ వైరస్ సోకిన వ్యక్తుల కొన్ని కేసుల్లో శరీరం లోపలా, బయటా రక్తస్రావం అవుతుంది. వైరస్ బారినపడిన వ్యక్తి శరీర ద్రవాల ద్వారా ఇది ఇతరులకూ వ్యాపిస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

