Islamia University: పాకిస్థాన్ ఇస్లామియా వర్సిటీలో సెక్స్ కుంభకోణం.. 5వేల పోర్న్ వీడియోలు లభ్యం
Islamia University: పాక్ వర్సిటీలో సెక్స్ స్కాండల్ చోటుచేసుకున్నది. ఆ వర్సటీ నుంచి 5వేల పోర్న్ వీడియోలను సీజ్ చేశారు. డ్రగ్స్‌కు బానిసైన విద్యార్థులు సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరపరిచింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బహవల్‌పుర్ ఇస్లామియా యూనివర్సిటీ( Islamia University)లో దారుణమై నిజాలు బయటపడ్డాయి. ఆ వర్సిటీలో డ్రగ్స్, సెక్స్ కుంభకోణం చోటుచేసుకున్నట్లు తేలింది. వర్సిటీ విద్యార్థులకు చెందిన సుమారు అయిదు వేల ఫోర్న్ వీడియోలు కూడా లభ్యం అయ్యాయి. ఈ ఘటనతో ఆ దేశంలో ప్రకంపనలు మొదలయ్యాయి. డ్రగ్స్‌కు బానిసైన మహిళా విద్యార్థినులకు చెందిన వీడియోలు కలవరం సృష్టిస్తున్నాయి. వర్సిటీకి చెందిన సిబ్బంది నుంచి పోలీసులు ఆ వీడియోలను సీజ్ చేశారు.
నిజానికి బహవల్‌పుర్ వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తాజా ఘటనతో ఆ వర్సిటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఎపిసోడ్లో కేంద్ర మంత్రి చౌదరీ తారిక్ బాషిర్ చీమా కుమారుడు మాస్టర్‌మైండ్‌గా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతను డ్రగ్స్ దందాకు పాల్పడుతున్నట్లు తేలింది. ఆ డ్రగ్స్ వల్లే వందల సంఖ్యలో ఇస్లామియా యూనివర్సిటీలో చదువుకుంటున్న మహిళా విద్యార్థులు సెక్స్ ఊబిలోకి దిగుతున్నట్లు భావిస్తున్నారు.
టాప్ సెక్యూర్టీ అధికారి మేజర్ ఇజాజ్ షా వద్ద అప్రోడిసియాక్ పిల్స్‌తో పాటు డ్రగ్స్ కూడా లభించాయి. ఐయూబీ విద్యార్ధులు, ఉద్యోగుల అశ్లీల వీడియో రికార్డింగ్స్ కూడా ఆయన వద్ద లభించాయి. మంత్రి చీమా తన కుమారుడిని రక్షించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయిదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు వర్సిటీలో దర్యాప్తు చేశారు. తనిఖీల్లో వందల సంఖ్యలో పోర్న్ వీడియోలు దొరికాయి. యూనివర్సిటీ సెక్యూర్టీ ఆఫీసర్ ఇజాజ్‌ను ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

