చైనాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది. లాక్డౌన్ల మీద లాక్డౌన్లు విధిస్తున్నారు. దీంతో ప్రజలు కరోనా కంటే లాక్‌డౌన్‌కే ఎక్కువ భయపడిపోతున్నారు. షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు లేకున్నా… ఐసోలేషన్లోకి పంపిస్తున్నారు. అలాగే షాంఘైను విడిచి విదేశీయులు వెళ్లిపోతున్నారు.
అయితే.. చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహిళను బలవంతంగా టెస్టింగ్ సెంటర్లో కూర్చోబెట్టి, కరోనా పరీక్షలు చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది.
这个强行检测姿势应该让全世界看一看🤬😡 pic.twitter.com/PUwnfCXF4t
— 浩哥i✝️i🇺🇸iA2 (@S7i5FV0JOz6sV3A) April 27, 2022
అయితే వీటికి సంబంధించిన వీడియోలను వీబో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత అన్ని సోషల్ మీడియాల్లోకి వెళ్లిపోయింది. అయితే ఈ వీడియో ఏ ప్రాంతంలోనిది అన్నది మాత్రం ఇంకా ధ్రువీకరణ కాలేదు. మొత్తానికి షాంఘైలో ఇగో.. ఇలా బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారన్నది మాత్రం తెలుస్తోంది.
Chinese government forcing grandma take a mandatory Covid test pic.twitter.com/tD1aZCdj6v
— Songpinganq (@songpinganq) March 19, 2022