Donald Trump | ట్రంప్ హెచ్చరికల పర్వం.. పనామా కాలువను స్వాధీనం చేసుకుంటాం
అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పర్వంలో ఈసారి పనామా కాలువ వంతు వచ్చింది.
Donald Trump | వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల పర్వంలో ఈసారి పనామా కాలువ వంతు వచ్చింది. పనామా కాలువను ఉపయోగించుకునే అమెరికన్ నౌకలకు మితిమీరిన ఛార్జీలను వసూలు చేస్తున్నారని ట్రంప్ ‘ట్రూత్ సోషల్’లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. అమెరికన్ నావికా దళం, వాణిజ్యాలను అత్యంత అన్యాయంగా చూస్తున్నారని మండిపడ్డారు.
పనామా పట్ల అమెరికా అసాధారణమైన దాతృత్వాన్ని ప్రదర్శించిందని, అయినప్పటికీ పనామా వసూలు చేస్తున్న ఛార్జీలు హాస్యాస్పదంగా ఉన్నాయని స్పష్టం చేశారు. కాలువపై నియంత్రణను అప్పగించడంలోని నైతిక, చట్టపరమైన నిబంధనలను పాటించకపోతే కాలువను పూర్తిగా తిరిగి తమకు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తామన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

