Donald Trump | న్యూయార్క్, మార్చి 17: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించకపోతే రక్తపాతమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వలసదారులపై కూడా ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శనివారం ఓహియోలో ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ… ‘మెక్సికోలో కార్లను తయారుచేసి అమెరికన్లకు విక్రయించాలని చైనా భావిస్తున్నది. ఎన్నికల్లో నేను గెలిస్తే ఆ కార్లను అమెరికాలో అమ్మనివ్వను. ఒకవేళ నేను గెలవకపోతే అది దేశానికి రక్తపాతం అవుతుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రచార బృందం తీవ్రంగా తప్పుబట్టింది. అమెరికన్ ప్రజలు మాత్రం మరోసారి ఆయనను ఎన్నికల్లో ఓడించాలని అనుకుంటున్నారని బైడెన్ బృందం పేర్కొన్నది.