US President Donald Trump | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణం..!
US President Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాల మానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు ట్రంప్‌తో యూఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయడం ఇది రెండో సారి. ట్రంప్‌తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్ ప్రమాణం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్‌తో కూడా అమెరికా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. చలి కారణంగా క్యాపిటల్ హిల్స్ లోపల లోని రోటుండా హాలులో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. 40 ఏళ్ల తర్వాత క్యాపిటల్ హిల్స్ లోని రోటుండా హాలులో లోపల ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. ఇంతకు ముందు 1985లో రొనాల్ట్ రీగన్ కూడా క్యాపిటల్ హిల్స్ లోపల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు. భారత ప్రభుత్వం తరఫున విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, మెటా అధినేత మార్క్ జుకర్ బర్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డొనాల్ట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్లు నిర్వహించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో 25 వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

