Donald Trump : పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత కారణంగా నాటో సభ్య దేశాలతో పాలు పలుదేశాల్లో చమురు కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొడొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తమకు సహరించని నాటో దేశాలను మరోసారి హెచ్చరించారు. ప్రస్తుతం నాటో కూటమి సహా పలు దేశాల ముందు రెండే దారులున్నాయి. ఒకటి అమెరికా నుంచి చమురు కొనడం లేదంటే హర్మూజ్ జలసంధి నుంచి చమురు నౌకలను సురక్షితంగా రప్పించుకోవడం అని ట్రంప్ సలహా ఇచ్చారు.
నాలుగు వారాలకు పైగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో బ్రిటన్ సహా పలు దేశాల్లో చమురు కొరత ఏర్పడింది. ఈ యుద్ధం తీవ్రంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అకాశాన్ని తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ సహా ప్రపంచ దేశాలకు కీలక సలహా ఇచ్చారు.
“All of those countries that can’t get jet fuel because of the Strait of Hormuz, like the United Kingdom, which refused to get involved in the decapitation of Iran, I have a suggestion for you…” – President Donald J. Trump pic.twitter.com/aPYmL0qspa
— The White House (@WhiteHouse) March 31, 2026
‘హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగానే బ్రిటన్‌తో పాటు మాతో సహకరించడానికి నిరాకరించిన దేశాలకు ముడి చమురు లభించడం లేదు. ఈ సందర్భంలో నేను మీకో సలహా ఇస్తున్నా. ఒకటి అమెరికా నుంచి ఆయిల్ కొనండి. మా దగ్గర చాలా చమురు ఉంది. రెండోది.. హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటేందుకు ధైర్యాన్ని ప్రదర్శించి చమురు తెచ్చుకోండి. మీకోసం మీరు పోరాడడం ఎలాగో ఇప్పుడైనా నేర్చుకోవడం మొదలెట్టండి. అమెరికా ఇక ఏమాత్రం మీకు సాయం చేయదు. మాకు మీరు సాయపడలేదుగా. ఇరాన్‌ను తప్పనిసరిగా నాశనం చేస్తాం. ఈ కష్టమైన పని పూర్తైంది. సో. మీరు వెళ్లి మీ చమురు తెచ్చుకోండి’ అని ట్రుత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు.
అంతర్జాతీయ జల రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా ప్రపంచ దేశాలకు దాదాపు 20 శాతం చమురు సరఫరా అవుతుంది. అయితే.. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయేల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ మార్గాన్ని మూసేసింది. దాంతో, చమురు దిగుమతులు తగ్గిపోయాయి. ఫలితంగా యుద్ధానికి ముందు మార్కెట్లో 75 అమెరికన్ డాలర్లున్న బ్యారెల్ చమురు ధర ప్రస్తుతం వంద అమెరికన్ డాలర్లకు చేరింది.
“The United States of America is in serious discussions with A NEW, AND MORE REASONABLE, REGIME to end our Military Operations in Iran.” – President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/0MWL2hSNmK
— The White House (@WhiteHouse) March 30, 2026
దాంతో.. హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచేందుకు యుద్ధ నౌకలు పంపాలని మిత్ర దేశాలను ట్రంప్ అభ్యర్థించారు. కానీ, నాటో సహా ఎవరూ ముందుకు రాలేదు. తన మాటకు విలువ లేదని తెలిసిన ట్రంప్ నాటో దేశాలకు అమెరికా ఏ విధమైన సాయం చేయదని ప్రకటించారు. అంతేకాదు హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఖర్గ్ ద్వీపం, విద్యుత్ కేంద్రాలను పేల్చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు. అయినా సరే ఇరాన్ మాత్రం తగ్గేదేలే అంటూ క్షిపణి దాడులను కొనసాగిస్తోంది.