వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్ ఒబామాలను ఒక వీడియోలో కోతులుగా మార్చి వ్యంగ్యంగా సామాజిక మాధ్యమంలో ఉంచిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యపై పలువురు మండిపడుతున్నారు.
బ్యాలెట్ లెక్కింపు సంస్థ డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ 2020లో గెలుపును తన నుంచి అపహరించడానికి సహాయపడిందన్న తప్పుడు వాదనలను పునరావృతం చేస్తూ ఒక నిమిషం నిడివి గల ఈ వీడియోను ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికలో గురువారం ఉంచారు. ట్రంప్ చర్యపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.