Donald Trump: గ్వాంటనామో బేలో 30 వేల సామర్థ్యంతో శరణార్థుల డిటెన్షన్ సెంటర్.. డోనాల్డ్ ట్రంప్ ఆదేశం
Donald Trump: నేర చరిత్ర కలిగిన అక్రమ వలసదారుల్ని గ్వాంటనామో బేలో ఉన్న జైళ్లలో బంధించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్లాన్ చేశారు. అక్కడి జైళ్లలో 30 వేల బెడ్లు ఉన్నాయని, హై ప్రొఫైల్ నేరగాళ్లను అక్కడికి తరలించనున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన ఓ మెమోరాండంపై సంతకం చేశారు.
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్వాంటెనామో బేలో శరణార్థుల జైలు నిర్మాణానికి ఆదేశం ఇచ్చారు. సుమారు 30 వేల మంది శరణార్థులను బంధీ చేసే రీతిలో ఆ డిటెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. తీవ్ర స్థాయి క్రిమినల్స్‌ను ఆ జైళ్లలో బంధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్వాంటనామో బేలో కేవలం ఉగ్రవాదుల్ని మాత్రమే బంధీ చేసేవారని, ఇక నుంచి నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారుల్ని అక్కడి జైళ్లలో వేయనున్నారు.
కొత్త ఆదేశాలకు చెందిన మెమోరాండంపై ట్రంప్ సంతకం చేశారు. డిఫెన్స్, హోంలాండ్ సెక్యూర్టీ శాఖలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. చాలా మందికి ఈ విషయం తెలియదని, గ్వాంటనామో బేస్‌లో సుమారు 30 వేల మంచాలు ఉన్నాయని, అమెరికా ప్రజలను వేధించే నేరగాళ్లను దాంట్లో ఖైదు చేయనున్నట్లు వైట్‌హౌజ్‌లో ట్రంప్ పేర్కొన్నారు. కొందరు నేరగాళ్లు చాలా క్రూరంగా ఉన్నారని, వాళ్లను వాళ్ల స్వంత దేశాలు కూడా పట్టుకోలేవని, అలాంటి నేరగాళ్లను గ్వాంటనామో బేలో వేయనున్నట్లు చెప్పారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి తరిమేస్తామని ఎన్నికల్లో ట్రంప్ వాగ్దానం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Last Man In Tower | మనసును కదిలించే భావోద్వేగాల ప్రయాణం.. ఓటీటీలోకి మనోజ్ బాజ్‌పాయ్ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’
Swag of Arjun | నాగచైతన్య ‘వృషకర్మ’ నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Tyson Naidu | బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్ అప్డేట్!
AP News | మురసు తుపాను ఎఫెక్ట్.. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు..!
Ear Wax | గులిమి అంటే ఏమిటి.. దీని వల్ల లాభమా, నష్టమా.. తరచూ తొలగించాలా..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

