ట్రంప్‌కు మరో షాక్
అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడని ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించి పట్టుమని 10 రోజులైనా గడవకముందే మరో రాష్ట్రం ఆయనకు షాక్ ఇచ్చింది.
- ప్రైమరీలో పోటీపడకుండా మైన్ రాష్ట్రం నిషేధం
పోర్ట్‌ల్యాండ్ (అమెరికా), డిసెంబర్ 29: అమెరికా అధ్యక్ష పీఠాన్ని రెండోసారి కైవసం చేసుకోవాలని తహతహలాడుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అధ్యక్ష పదవికి ట్రంప్ అనర్హుడని ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించి పట్టుమని 10 రోజులైనా గడవకముందే మరో రాష్ట్రం ఆయనకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ట్రంప్ అనర్హుడని తాజాగా మైన్ రాష్ట్రం స్పష్టం చేసింది. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మైన్ రాష్ట్రంలో ట్రంప్ అభ్యర్థిత్వాన్ని కొందరు సవాలు చేశారు. వారి అప్పీళ్లను పరిగణనలోకి తీసుకున్న ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి షెన్నా బెల్లోస్.. ప్రెసిడెన్షియల్ ప్రైమరీ బ్యాలెట్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తున్నట్టు గురువారం ప్రకటించారు.
తద్వారా అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న అభ్యర్థిపై ఏకపక్షంగా వేటువేసిన తొలి అధికారిగా ఆమె రికార్డులకు ఎక్కారు. కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ రిపబ్లికన్ పార్టీ చేసుకున్న అప్పీలుపై నిర్ణయాన్ని ప్రకటించేందుకు అమెరికా సుప్రీంకోర్టు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామం జరిగింది. అయితే, దీనిపై ట్రంప్ కోర్టును ఆశ్రయించేందుకు బెల్లోస్ అవకాశం కల్పించారు. అప్పటివరకు తన నిర్ణయం అమలును నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో బెల్లోస్ నిర్ణయాన్ని మైన్ కోర్టులో సవాలు చేయనున్నట్టు ట్రంప్ మద్దతుదారులు తెలిపారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి అనంతరం ఆయన మద్దతుదారులు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ను అడ్డుకునేందుకు 2021 జనవరి 6న యూఎస్ క్యాపిటల్‌పై దాడికి దిగిన విషయం విదితమే. వారిని సమర్ధించి, హింసను ప్రేరేపించినట్టు ట్రంప్‌పై అభియోగాలున్నందున వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

