ట్రంప్ గోల్డ్‌కార్డు వెబ్సైట్ ప్రారంభం
ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి 50 లక్షల డాలర్లు(దాదాపు రూ. 43 కోట్లు) చెల్లించడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడమే ఈ గోల్డ్ కార్డు ఉద్దేశం.
- అధికారికంగా పేర్ల రిజిస్ట్రేషన్‌కు ఆహ్వానం
- 50 లక్షల డాలర్లతో గ్రీన్‌కార్డుకు రాచమార్గం
వాషింగ్టన్,జూన్ 12 : ఎంతోకాలంగా ఊరిస్తూ వస్తున్న గోల్డ్ కార్డు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రారంభించారు. విదేశీ వలసదారులు అమెరికా ప్రభుత్వానికి 50 లక్షల డాలర్లు(దాదాపు రూ. 43 కోట్లు) చెల్లించడం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడమే ఈ గోల్డ్ కార్డు ఉద్దేశం. ప్రపంచంలో ఎక్కడా లేని అత్యంత గొప్ప దేశానికి, మార్కెట్‌కు దారి చూపించే అద్భుత ప్రయాణం సాగించేందుకు ఎక్కడ సంతకం చేయాలని వేలాదిమంది తనను అడుగుతున్నట్లు ట్రంప్ తన ట్రూత్ పోస్టులో పేర్కొన్నారు.
దరఖాస్తు ఎలా?
ట్రంప్ కార్డుపై ఆసక్తి ఉన్న వారిని మాత్రమే వెబ్సైట్ అనుమతిస్తోంది. అభ్యర్థి తన పేరు, మతం, చిరునామాను రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. trumpcard.gov పేరుతోఉన్న ఈ కొత్త వైబ్సైట్లో బంగారు రంగు కార్డు నమూనాను ఉంచారు. కార్డుపైన 5 మిలియన్ డాలర్లని అంకె ముద్రించారు. యూరప్, ఆసియా(పశ్చిమాసియాతో సహా), ఉత్తర అమెరికా, ఓషియానియా, మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, కరీబియన్, ఆఫ్రికా వంటి 8 ప్రాంతాల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

