Donald Trump | 2020 ఎన్నికల్లో అక్రమాలు.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు (Atlanta's Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు.
అట్లాంటా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అరెస్టయ్యారు. 2020 నాటి అధ్యక్ష ఎన్నికల్లో ఆక్రమాలు, అవకతవకలు, ఫలితాల్లో జోక్యం, కుట్ర వంటి ఆరోపణలు ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అట్లాంటా ఫుల్టన్ కౌంటీ జైలు (Atlanta’s Fulton county jail) వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. దీంతో ఆయన్ని అరెస్ట్ (Arrested) చేశారు. జైలులో 20 నిమిషాలపాటు గడిపారు. అనంతరం 2 లక్షల డాలర్ల పూచికత్తుతో విడుదలయ్యారు. ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదీ ఒకటి.
గురువారం రాత్రి 7 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ట్రంప్ ఆట్లాంటాకు (Atlanta) వెళ్లారు. ఆయన అరెస్ట్, విడుదలకు సంబంధించిన ప్రక్రియ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. అయితే జైలు అధికారులు ట్రంప్‌కు సంబంధించి పలు వివరాలు తీసుకున్నారు. 77 ఏండ్ల ట్రంప్ 6 అడుగుల 3 ఇంచ్‌ల ఎత్తు, 215 పౌండ్ల బరువు ఉన్నట్లు తమ రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఆయనకు స్ట్రాబెరీ లేదా బ్లాండ్ జట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ గత మార్చి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఆయనపై నాలుగు నగరాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. వాటిలో కొన్నింట్లో ఆయన దోషిగా కూడా తేలారు.

కాగా, ఇన్ని కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ.. ట్రంప్ తనని తాను వెనకేసుకొచ్చుకుంటున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, ప్రభుత్వం తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నని ఆరోపించారు. దేశ చరిత్రలో తన అరెస్ట్.. ఒక చీకటి రోజుగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఐదో వన్డేలోనూ భారత్ తడబాటు.. 94 పరుగులకే నాలుగు వికెట్లు డౌన్!
Indiramma Illu | రూ.30వేలు ఇస్తేనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు.. తొర్రూర్‌లో అధికారుల పేరుతో లంచం డిమాండ్!
Kaaka | చిరంజీవి ‘కాకా’లో స్పెషల్ సాంగ్.. రితికా సింగ్‌తో మాస్ స్టెప్పులు, షూటింగ్ కూడా పూర్తి!
AI Technology | చాట్‌జీపీటీతో అద్భుతం.. రెండున్నరేళ్ల తర్వాత భర్త చెంతకు చేరిన తప్పిపోయిన భార్య!
Sabarimala | శబరిమల ప్రసాదం ఇంటికే డెలివరీ
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

