Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ పోటీ చేస్తాను కావొచ్చుః డొనాల్డ్ ట్రంప్
2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో బరిలోకి ట్రంప్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని ట్రంప్ ముగ్గరు సలహాదారులు కూడా నిజమని నిర్ధారిస్తున్నారు. అమెరికాలో వచ్చేవారం మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఒక ర్యాలీలో పాల్గొన్నారు డొనాల్డ్ ట్రంప్. ‘మనదేశాన్ని బలీయమైన శక్తిగా, సురక్షితంగా, విజయమంతమైన దేశంగా మార్చేందుకు నేను బహుశా మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఏడాది మనం మళ్లీ వైట్‌హౌస్‌లో అడుగుపెట్టబోతున్నాం. సెనేట్‌గా గెలవబోతున్నాం 2024 ఎన్నికల్లో అమెరికాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అందుకు అందరూ సిద్ధంగా ఉండండి’ అని అక్కడి జనాన్ని ఉద్దేశించి ఉత్తేజంగా ప్రసంగించారు ట్రంప్.
వ్యాపారవేత్త నుంచి అధ్యక్షుడిగా
బరాక్ ఒబామా తర్వాత 2016లో అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు డొనాల్డ్ ట్రంప్. పెద్ద వ్యాపారవేత్త అయిన ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగి, డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ని ఓడించారు. ఈమె అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య. ట్రంప్ తన పదవీకాలం తర్వాత మళ్లీ అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్నారు. అంతేకాదు, వైట్‌హౌస్‌ను ఖాళీ చేయకపోవడం, అధికార మార్పిడికి సహకరించకపోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచారు ట్రంప్. ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్తి జో బిడెన్ పదవీకాలం 2024లో ముగుస్తుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

