వాషింగ్టన్: ప్రఖ్యాత సంగీత శిఖరం డాన్ విలియ్స్ (100) ఇక లేరు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో శుక్రవారం బ్రాన్సన్లోని తన స్వగృహంలో డాన్ విలియమ్స్ కన్నుమూశారు. డాన్ విలియమ్స్ తన సోదరులు అండీ విలియమ్స్, డిక్ విలియమ్స్, బాబ్ విలియమ్స్‌తో సంగీత చతుష్టయంగా ఏర్పడ్డారు. రేడియోలో, సినిమాల్లో ఎన్నో పాటలు పాడారు.
నలుగురు విలియమ్స్ సోదరుల్లో మిగిలిన ముగ్గురు ఇప్పటికే మరణించారు. తల్లిదండ్రులకు రెండో సంతానమైన డాన్ విలియమ్స్ ఇప్పుడు కన్నుమూశారు. డాన్ విలియమ్స్ 1922, అక్టోబర్ 9న వాల్ లేక్, లోవా దంపతులకు జన్మించారు. స్కూల్‌కు వెళ్లే సమయంలోనే విలియమ్స్ సోదరులు తమ సొంత రేడియోకు పాటలు పాడేవారు.
డాన్ విలియ్స్కు ఇద్దరు కవల కుమారులు డేవిడ్ అండీతోపాటు 41 సంవత్సరాల భార్య, మనుమడు హారిసన్ ఉన్నారు. డాన్ సోదరుడు బాబ్ విలియమ్స్ 2003లో తన 85 ఏండ్ల వయసులో మృతిచెందారు. 1926లో జన్మించిన డిక్ విలియమ్స్ 1926లో తన 91వ ఏట మరణించారు.