తప్పిపోయిన కుక్క ఏడేండ్లకు దొరికింది..!
Missing dog found after 7 years: అమెరికాలో ఓ కుక్క తప్పిపోయి ఏడేండ్ల సుదీర్ఘ కాలం తర్వాత దాని యజమానికి మళ్లీ దొరికింది.

ఫ్లోరిడా: అమెరికాలో ఓ కుక్క తప్పిపోయి ఏడేండ్ల సుదీర్ఘ కాలం తర్వాత దాని యజమానికి మళ్లీ దొరికింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని యార్క్‌షైర్ కౌంటీలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. టెర్రియర్ మిక్స్ బ్రీడ్‌కు చెందిన పెప్పర్ అనే ఓ పెంపుడు కుక్క 2014లో దాని యజమానురాలు నుంచి తప్పిపోయింది. దాంతో కుక్క కోసం అంతా వెతికిన యజమానురాలు ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుక్క తప్పిపోయి ఏడేండ్లు గడిచినా దాని ఆచూకీ లభ్యం కాకపోవడంతో యజమానురాలు కూడా ఆశలు వదులుకుంది.
కానీ, అంతలోనే అద్భుతం జరిగింది. ఏడేండ్ల తర్వాత ఆ తప్పిపోయిన కుక్క ఆచూకీ లభ్యమైంది. ఫ్లోరిడాకు 1600 కిలోమీటర్ల దూరంలోగల మిచిగాన్ రాష్ట్రంలోని ఈటన్ కౌంటీలో ఆ కుక్క ఉన్నట్లు తెలిసింది. అక్కడి యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఈ విషయాన్ని యజమానురాలికి తెలియజేయగానే ఆమె ఫ్లోరిడా నుంచి మిచిగాన్కు విమానంలో వెళ్లి తన కుక్కను తీసుకొచ్చుకుంది. అయితే ఆ కుక్క అంతదూరం ఎలా ప్రయాణించింది అనే విషయం మాత్రం సస్పెన్స్‌గా మారింది.
మైక్రోచిప్ అమర్చడం వల్లే ఆ కుక్క దొరికింది..!
తప్పిపోయిన కుక్క పెప్పర్ ఏడేండ్ల తర్వాత మళ్లీ దొరకడానికి కారణం దానికి మైక్రోచిప్ అమర్చడమేనని తేలింది. కుక్క తప్పిపోకముందు దాని యజమానురాలు ఆ కుక్కకు మైక్రోచిప్ అమర్చింది. అయితే, గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తన వివరాలను అప్డేట్ చేసింది. ఆ వివరాలు కుక్కకు అమర్చిన మైక్రోచిప్‌లో లభ్యం అయ్యాయి. దాంతో ఆ కుక్క దొరికిన వెంటనే మిచిగాన్ యానిమల్ కంట్రోల్ డిపార్టుమెంట్ వాళ్లు ఆమెకు ఫోన్‌చేసి చెప్పారు.
కాగా, తప్పిపోయిన పెప్పర్‌ను గత ఐదేండ్లుగా ఓ కుటుంబం సాదుకుందట. అయితే, వారికి అది తప్పిపోయి వచ్చిన కుక్క అని గానీ, దానికి మైక్రోచిప్ అమర్చి ఉందని గానీ తెలియదట. ఇదిలావుంటే కుక్క తన కొత్త యజమాని దగ్గరకు రాకముందు రెండేండ్లు ఎక్కడో ఉందనే విషయంలో కూడా సస్పెన్స్ ఉంది. కాగా, పెంపుడు జంతువులకు మైక్రోచిప్ అమర్చడం, యజమాని తన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంవల్ల తప్పిపోయినా వాటిని గుర్తించడం సులువు అవుతుందని ఈటన్ కౌంటీ యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ సూచించింది.
ఇవి కూడా చదవండి..
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
కీలక నేతలతో ప్రధాని భేటీ రద్దు..!
ముంబైలో 88 బ్లాక్స్‌తో అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- florida
- Michigan
- Missing dog
- USA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

