మీరు కట్టుడుపండ్లు వాడుతున్నారా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
మీరు కట్టుడుపండ్లు వాడుతున్నారా? అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే న్యుమోనియా బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. కట్టుడు పండ్లను శుభ్రం చేసుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే న్యుమోనియా బారినపడడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
లండన్, జూన్ 26: మీరు కట్టుడుపండ్లు వాడుతున్నారా? అయితే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే న్యుమోనియా బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. కట్టుడు పండ్లను శుభ్రం చేసుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే న్యుమోనియా బారినపడడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శుభ్రంగా ఉంచుకోని కట్టుడు పండ్లలో పలు జబ్బులకు కారణమయ్యే మైక్రోబ్స్ చేరుతాయని, అవి లాలాజలం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఇన్ఫెక్షన్కు కారణమవుతాయని ఇంగ్లండ్‌లోని కార్డిఫ్ యూనివర్సిటీ తెలిపింది.
కట్టుడు పండ్లు ధరించి న్యుమోనియాతో బాధపడుతూ దవాఖానలో చేరిన వారి నోరు, నాలుక, కట్టుడు పండ్ల స్వాబ్‌ను సేకరించిన పరిశోధకులు.. కట్టుడు పండ్లు ధరించి కేర్ హోమ్స్‌లో ఉంటూ న్యుమోనియా బారినపడని వారి స్వాబ్‌తో పోల్చినప్పుడు ఈ విషయం తేటతెల్లమైంది. న్యుమోనియాతో బాధపడుతున్న వారి కట్టుడు పండ్లలో 20 రెట్లు ఎక్కువగా న్యుమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియా ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయినట్టు యూనివర్సిటీ లీడ్ ఆథర్ డాక్టర్ జోష్ ట్విగ్ తెలిపారు. ఈ పరిశోధన ఫలితాలు మెడికల్ మైక్రోబయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

