Olena Zelenska | ఉక్రెయిన్ అధ్యక్షుడి ధైర్యం ఆమెనే..
Olena Zelenska | రాజభోగాలు అనుభవించినా.. కారడవిలో జీవించినా కట్టుకున్నవాడి వెంటే అనుకున్నది ఆమె. అందుకే భర్త కమెడియన్‌గా ఉన్నప్పుడు ఆయన్ను ఎంకరేజ్ చేసింది. యాక్టింగ్ మానేసి రాజకీయాల్లోకి వెళ్తానంటే తనకు ఇష్టం లేకున్నా భర్తను ప్రోత్సహించింది. దేశాధినేతగా ఎదిగేవరకు వెన్నంటి ఉంది. ఇప్పుడు భర్త చావోరేవో అన్న పరిస్థితుల్లో ఉంటే ప్రాణాలకు తెగించి మరీ తన వెంటే ఉంటానని అంటోంది ఆమె ఎవరో కాదు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు ( Ukraine President ) జెలెన్ స్కీ ( Volodymyr Zelensky ) అర్ధాంగి ఒలెనా జెలెన్స్కా ( Olena Zelenska ). రష్యా మారణకాండకు భయపడి చాలామంది ప్రజలు దేశం విడిచి పారిపోతుంటే.. అవకాశం ఉన్నప్పటికీ ఎక్కడికీ వెళ్లకుండా యుద్ధకాండలో భర్తకు తోడుగా ఉంటుంది. ఒకవైపు భర్తకు సపోర్ట్‌గా ఉంటూనే.. మరోవైపు దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నది.

ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ, ఒలెనా ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర చదువుకున్నారు. కానీ కాలేజీ రోజుల్లోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ అనుబంధం కాస్త ప్రేమగా మారి పెండ్లికి దారితీసింది. 2003లో జెలెన్ స్కీ, ఒలెనా పెండ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అప్పటికి జెలెన్ స్కీ మాములు నటుడు. కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఆ సమయంలో జెలెన్ స్కీని ఎంతగానో ఎంకరేజ్ చేసింది. ఆయన ఎదుగుదలలో భాగమైంది. ఆ తర్వాత నటుడిగా కెరీర్‌కు స్వస్తి పలికి.. రాజకీయాల్లోకి వెళ్దామని జెలెన్ స్కీ నిర్ణయించుకున్నప్పుడు వ్యతిరేకించింది. కానీ దేశ ప్రజలకు సేవ చేయాలన్న భర్త సంకల్పాన్ని గ్రహించిన ఒలెనా.. తనకు ఇష్టం లేకున్న వెన్నంటి ప్రోత్సహించింది. రాజకీయ నేత నుంచి దేశాధ్యక్షుడిగా ఎదిగేంత వరకు ఆయన వెన్నంటి ఉంది.

ఒలెనా ఆర్కిటెక్చర్ చదివింది. ఆమె రచయిత కూడా. అంతేకాదు 2019లో జెలెన్ స్కీ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దేశ ప్రథమ మహిళగా ఒలెనా సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తించింది. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై లింగ వివక్షపై తన గళం వినిపించింది. ఇప్పుడు ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతున్న సమయంలోనూ చాలా ధైర్యంగా దేశం కోసం నిలబడింది. తన భర్తకు మద్దతుగా దేశ ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నది. జెలెన్ స్కీ, అతని కుటుంబం దేశం విడిచివస్తే ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆఫర్ ఇచ్చాయి. కానీ జెలెన్ స్కీ మాత్రం తన దేశం కోసం, దేశ ప్రజల కోసం అక్కడే ఉంటానని ప్రకటించాడు. అంతేకాదు.. సైనికుడిలా మారి యుద్ధభూమికి కూడా వెళ్లాడు. ఇదంతా జెలెన్ స్కీ ఒక్కడి ధైర్యం కాదు. జెలెన్ స్కీ సతీమణి ఒలెనాది కూడా. ఎందుకంటే తమ, పిల్లల ప్రాణాలు కాపాడుకునేందుకు దేశం విడిచి వెళ్లిపోదామని జెలెన్ స్కీని వెనక్కి లాగలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జెలెన్ స్కీకి ధైర్యం చెప్పి అక్కడే ఉండేలా ప్రేరేపించింది. నా భర్త ఎక్కడికి పారిపాలేదు. ఆయన ఇక్కడే ఉన్నాడు.. ఆయన వెంట నేనున్నానంటూ ధైర్యంగా చెబుతున్నది. ఈ క్లిష్ట సమయంలో నా పిల్లలు నావైపు చూస్తున్నారు. ఇప్పుడు నేను వారి పక్కన ఉండాలి. అలాగే నా భర్తకు అండగా ఉండాలి. దేశ ప్రజల కోసం నిలబడాలి. కాబట్టి నాకు ఏ మాత్రం భయంలేదు. కన్నీరు రాదు అంటూ మొండిపట్టుదలను చూపిస్తున్నది. ఉక్రెయిన్ ప్రజలు నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెడతూ వారికి ధైర్యం చెబుతున్నది.
Read More :
ఆగని బాంబుల మోత : కీవ్‌లో ఇండియన్ రెస్టారెంట్ యజమాని ఔదార్యం!”
ఉక్రెయిన్ ఎఫెక్ట్.. 110 డాలర్లకు చేరిన బ్యారెల్ ఇంధనం ధర”
“ఉక్రెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లి.. నడుచుకుంటూ బోర్డర్ దాటిన హాలీవుడ్ హీరో”
ఉక్రెయిన్ నుంచి ఇస్తాంబుల్ మీదుగా భారత్ చేరిన 220 మంది విద్యార్థులు”
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

