Dinosaur | న్యూఢిల్లీ : భూమిపై గతంలో జీవించిన డైనోసార్లు ప్రస్తుతం మరో గ్రహంలో జీవించి ఉండే అవకాశం ఉన్నట్టు తాజా అధ్యయనం చెప్తున్నది. భూమిపై నిజ జీవితంలో కనిపించిన జురాసిక్ వరల్డ్ ప్రస్తుతం మరో గ్రహం మీద ఉనికిలో ఉండొచ్చని వెల్లడించింది.
మరో గ్రహంపై ఉన్న ఈ గ్రహాంతర జీవులను గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం భూమిపై నివసించే మానవులకు ఉన్నదని పరిశోధకులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం రాయల్ అస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్లో ప్రచురితమైంది. భూమికి దూరంగా ఉన్న ఇతర గ్రహాలపై డైనోసార్ జాతులు జీవించి ఉండే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. డైనోసార్లు జీవించిన కాలంలో భూమిపై అత్యధికంగా 30 శాతం ఆక్సిజన్ ఉండేదని, కానీ ప్రస్తుతం భూమిపై ఆక్సిజన్ స్థాయిలు 21 శాతం మేరకే ఉన్నాయని తెలిపింది.