Real Estate | దేవుడితో కలిసి ఆవాసం..స్వర్గంలో ప్లాట్లు అమ్ముతున్న స్పానిష్ చర్చి
మార్స్పైనో, చంద్రుడిపై రియల్ ఎస్టేట్ అంటే తెలుసు.. కానీ, స్వర్గంలోనూ రియల్ ఎస్టేట్ నడుస్తున్నదన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే తెలుసుకోండి.
- చదరపు మీటరుకు రూ.8 వేలు ధర
Real Estate | లండన్, జూన్ 24: మార్స్పైనో, చంద్రుడిపై రియల్ ఎస్టేట్ అంటే తెలుసు.. కానీ, స్వర్గంలోనూ రియల్ ఎస్టేట్ నడుస్తున్నదన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే తెలుసుకోండి. వీలైతే వెంటనే ఓ ప్లాట్ కొనేయండి. ఆలస్యం చేస్తే మాత్రం ఆశాభంగం. అవునండీ బాబూ.. స్వర్గంలో రియల్ ఎస్టేట్ నడిపిస్తున్నాడో స్పానిష్ చర్చి పాస్టర్. రేటు ఎంత అని అనుకుంటున్నారు? ఒక చదరపు మీటరుకు రూ.8 వేలు. దీనికి సంబంధించిన బ్రోచర్, ఓ టిక్‌టాక్ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. ఇంకా ఆ పాస్టర్ చెప్తున్నాడో తెలుసా.. స్వర్గంలో నివాసం ఉండేందుకు ఇప్పటికే దేవుడితో చర్చలు కూడా పూర్తయ్యాయట. 2017లో ఓసారి దేవుడితో మీటింగ్‌లో ఈ అంశం ప్రస్తావనకు రాగా, రియల్ ఎస్టేట్‌కు దేవుడు అనుమతి కూడా ఇచ్చాడట.
దేవుడితో పాటు, దేవుడి ఇంటికి పక్కనే నివాసం ఉండే గ్యారెంటీ కూడా ఉందట. స్వర్గానికి మెట్లు.. మేఘాల మధ్య ఓ ఇల్లు.. భార్యభర్తలు, పిల్లలతో కలిసి ఆ మెట్లు ఎక్కుతూ ఇంటి వైపు వెళ్తున్నట్టు క్రియేట్ చేసిన బ్రోచర్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరో విషయమండోయ్.. స్వర్గంలో ప్లాట్లు కొనటానికి వీసా, జీపే, యాపిల్‌పే, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, మాస్టర్ కార్డు, మాస్ట్రో కార్డు సదుపాయాలు కూడా ఉన్నాయ్. పైగా ఇన్స్టాల్మెంట్ సదుపాయం కూడా కల్పించారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఈ ఆఫర్ నమ్మి ఎంతోమంది వేల డాలర్లు పోసి జాగాలు కొనేస్తున్నారట. స్వర్గంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇదే తొలిసారి కాదు.. 2023లో దక్షిణాఫ్రికాలో ఓ పాస్టర్ కూడా తన ఫాలోవర్ల భూములు, ఆస్తులు అమ్మించి.. స్వర్గంలో జాగా కొనిపించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Apple Pay
- G-Pay
- plots
- real estate
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

