Male Infertility | సరికొత్త ఏఐ వ్యవస్థ.. రక్త పరీక్షతో పురుషుల వంధ్యత్వ నిర్ధారణ
పురుషుల్లో సంతాన లేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సి వచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్‌లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు. ఒక చిన్న రక్త పరీక్షతో పురుషుల్లో సంతాన లేమి(వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు.
- ఏఐ వ్యవస్థను అభివృద్ధి చేసిన జపాన్ పరిశోధకులు
Male Infertility | టోక్యో, ఆగస్టు 3: పురుషుల్లో సంతాన లేమిని గుర్తించేందుకు ఇప్పటివరకు వీర్య పరీక్ష చేయాల్సి వచ్చేది. ఇక నుంచి ఈ అవసరం లేదంటున్నారు జపాన్‌లోని టోహో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు. ఒక చిన్న రక్త పరీక్షతో పురుషుల్లో సంతాన లేమి (వంధ్యత్వం) సమస్యను గుర్తించవచ్చని చెప్తున్నారు. ఇందుకు గానూ వీరు ఒక కృత్రిమ మేధ(ఏఐ) మాడల్‌ను అభివృద్ధి చేశారు.
ఇది రక్తంలో ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, పీఆర్ఎల్, టోటల్ టెస్టోస్టిరోన్, ఈ2 వంటి వివిధ హార్మోన్ల స్థాయిలను విశ్లేషించి 74 శాతం కచ్చితత్వంతో పురుషుల వంధ్యత్వాన్ని గుర్తిస్తుందని, కొందరు పురుషుల్లో ఉండే అజూస్పెర్మియా సమస్యను 100 శాతం ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని చెప్పారు. 3,662 మంది రోగుల వైద్య నివేదికల సమాచారం ఆధారంగా ఈ ఏఐ మాడల్‌ను అభివృద్ధి చేసినట్టు అసోసియేట్ ప్రొఫెసర్ హిడెయుకి కొబయషి తెలిపారు. ఈ ఏఐ మాడల్‌ను 2021, 2022లో పలువురిపై పరీక్షించగా వంధ్యత్వానికి సంబంధించి 68 శాతం, అజూస్పెర్మియాకు సంబంధించి 100 శాతం ఖచ్చితత్వంతో ఫలితాలు వచ్చినట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

