అమెరికాలో ఫంగస్ భయం
అమెరికాను కాండిడా ఆరిస్ అనే ఓ ఫంగస్ వణికిస్తున్నది. ఆ దేశంలో 2016లో మొదటిసారి గుర్తించిన ఈ ఫంగస్.. ఇప్పటికే అక్కడి 25 రాష్ర్టాల్లో వ్యాపించింది. 2019 నుంచి 2021 మధ్య ఫంగస్ సోకిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజా నివేదిక పేర్కొన్నది.
వాషింగ్టన్: అమెరికాను కాండిడా ఆరిస్ అనే ఓ ఫంగస్ వణికిస్తున్నది. ఆ దేశంలో 2016లో మొదటిసారి గుర్తించిన ఈ ఫంగస్.. ఇప్పటికే అక్కడి 25 రాష్ర్టాల్లో వ్యాపించింది. 2019 నుంచి 2021 మధ్య ఫంగస్ సోకిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) తాజా నివేదిక పేర్కొన్నది.
ఈ ఫంగస్ ద్వారా కలిగి జబ్బును నయం చేయడానికి చికిత్స లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. 2016లో అమెరికాలో 53 మందికి సోకిన ఈ ఫంగస్.. క్రమంగా పెరుగుతూ 2022లో 2,377 మందికి సోకింది. పదిహేనేండ్ల క్రితం జపాన్లో మొదటిసారి గుర్తించిన కాండిడా ఆరిస్ ఫంగస్ జాడలను ఇప్పటివరకు 30కి పైగా దేశాల్లో గుర్తించారు. వృద్ధులు, తక్కువ రోగ నిరోధక శక్తి ఉన్న వారికి ఈ ఫంగస్ ప్రాణాంతకంగా మారుతుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

