మిలిటరీ బస్సుపై బాంబు దాడి.. 13 మంది మృతి

డమస్కస్: సిరియా రాజధాని డమస్కస్‌లో ఓ మిలిటరీ బస్సుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందినట్లు ఆ దేశ మీడియా పేర్కొన్నది. జిసర్ అల్ రయిస్ బ్రిడ్జ్‌ను దాటుతున్న సమయంలో రెండు బాంబులతో వాహనాన్ని పేల్చేశారు. వాస్తవానికి సిరియాలో గత దశాబ్ధ కాలం నుంచి ప్రచ్ఛన్న యుద్ధం సాగుతూనే ఉన్నది. అయితే ఇటీవల దేశ రాజధాని డమస్కస్‌లో మళ్లీ దాడి ఘటనలు పెరిగాయి. ఇడ్లిబ్ ప్రావిన్సులో ఉన్న అరిహ పట్టణంలో జరిగిన మరో దాడిలో అనేక మంది స్కూల్ విద్యార్థులు మృతిచెందినట్లు తెలుస్తోంది. అసద్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 2011 నుంచి సిరియాలో ఉద్యమం నడుస్తోంది. ఇప్పటి వరకు ఆ పోరాటంలో 3.50 లక్షల మంది మరణించారు. సగం మంది జనాభా తమ స్వంత ఇండ్లను విడిచి వెళ్లారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

