Pakistan | ఫిబ్రవరి 11న సార్వత్రిక ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీపీ
Pakistan | దాయాది దేశం పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఆ దేశ సుప్రీంకోర్టకు తెలిపింది. జనవరి 29 నాటికి నియోజకవర్గాల పునర్వీభజన పూర్తవుతుందని పాకిస్థాన్ ఎన్నికల సంఘం న్యాయవాది సజీల్ స్వాతి సుప్రీంకోర్టుకు తెలిపారు.
Pakistan | దాయాది దేశం పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఆ దేశ సుప్రీంకోర్టకు తెలిపింది. జనవరి 29 నాటికి నియోజకవర్గాల పునర్వీభజన పూర్తవుతుందని పాకిస్థాన్ ఎన్నికల సంఘం న్యాయవాది సజీల్ స్వాతి సుప్రీంకోర్టుకు తెలిపారు. నేషనల్ అసెంబ్లీ అండ్ పావిన్షియల్ లెటిస్లేచర్ ఎన్నికలను 90 రోజుల్లోగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 ఏప్రిల్‌లో నేషనల్ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానంతో ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షం గద్దెదించింది. ఆ తర్వాత పాక్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నది.
ఇటీవల ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు అల్వీ మాట్లాడుతూ.. జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని పేర్కొన్నారు. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్ (ECP)కి లేఖ రాయడంతోపాటు అనేక ప్రయత్నాలు జరిగాయన్నారు. జనవరి చివరి వారంలో ఎన్నికలు జరుగుతాయన్నారు. రాజకీయ పార్టీల డిమాండ్ ఉన్నప్పటికీ, ఖచ్చితమైన తేదీలను ప్రకటించేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరో వైపు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్ స్వదేశానికి చేరుకున్నాడు. అలాగే, మాజీ ప్రధాని ఇమ్రాన్ సైతం పలు కేసుల్లో చిక్కుకొని జైలులో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ పాల్గొనకుండా చేసేందుకు ప్రభుత్వం తనను అక్రమంగా కేసుల్లో ఇరికించిందని ఆరోపించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

