Xi Jinping: ధైర్యంగా పోరాడండి.. ధైర్యంగా గెలవండి: జీ జిన్పింగ్
Xi Jinping:చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) సమావేశాలు ఇవాళ ముగిసాయి. సమావేశాల ముగింపు సందర్భంగా దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్(Xi Jinping) ప్రసంగించారు. ధైర్యంగా పోరాటం చేయాలని, ధైర్యంగా గెలవాలని, తలలు వంచి కష్టపడాలని, నమ్మకంతో ముందుకు సాగాలని జీ జిన్పింగ్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సుమారు 2300 మం
బీజింగ్: చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) సమావేశాలు ఇవాళ ముగిసాయి. సమావేశాల ముగింపు సందర్భంగా దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్(Xi Jinping) ప్రసంగించారు. ధైర్యంగా పోరాటం చేయాలని, ధైర్యంగా గెలవాలని, తలలు వంచి కష్టపడాలని, నమ్మకంతో ముందుకు సాగాలని జీ జిన్పింగ్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సుమారు 2300 మంది పార్టీ నేతలు సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే మూడవ సారి దేశాధ్యక్ష పదవి చేపట్టేందుకు కావాల్సిన మార్పుల్ని చేస్తూ జిన్పింగ్ చేసిన తీర్మానానికి ఆమోదముద్ర పడినట్లు తెలుస్తోంది.
శనివారం జరిగిన సమావేశాల అనంతరం 200 మంది సీనియర్ పార్టీ నేతలతో కొత్త సెంట్రల్ కమిటీని ఎంపిక చేశారు. జిన్పింగ్ పనితీరును మెచ్చుకుంటూ ప్రతినిధులు ఓటేశారు. కమ్యూనిస్టు పార్టీ రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. పార్టీ జనరల్ సెక్రటరీగా జీ జిన్పింగ్ను ఆదివారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మళ్లీ ఆయన్నే జనరల్ సెక్రటరీగా ప్రకటిస్తే, అప్పుడు జీ జిన్పింగ్ మూడవసారి అధ్యక్ష పదవికి పోటీపడేందుకు లైన్ క్లియర్ అవుతుంది.
రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న కమ్యూనిస్టు పార్టీ నియమాన్ని 2018లో రద్దు చేసిన విషయం తెలసిందే. 25 మంది సభ్యులు ఉండే పోలిట్బ్యూర్లోనూ మార్పులు చేయనున్నారు. పోలిట్బ్యూర్లో జిన్పింగ్ మద్దతుదారులే ఉండనున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

