లండన్: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి కేంద్ర బిందువైన దక్షిణాఫ్రికాలో.. గడిచిన వారం రోజుల్లో కొత్త కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 40 శాతం తగ్గాయి. దీంతో డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరం కాదని ఓ అభిప్రాయానికి వచ్చారు. గడిచిన ఏడు రోజుల డేటాను పరిశీలిస్తే, కొత్త ఇన్ఫెక్షన్లు అమాంతంగా 35 శాతం తగ్గుముఖం పట్టాయి. వారం క్రితం 23 వేలు ఉన్న కేసుల సంఖ్య సోమవారం నాటికి 15వేలకు పడిపోయింది. కానీ ఒమిక్రాన్ పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డెల్టా వేరియంట్ కన్నా.. ఒమిక్రాన్ వల్ల తక్కువ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఓ అంచనాకూ వచ్చారు. వాస్తవానికి దక్షిణాఫ్రికాలో బీటా, డెల్టా వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపాయి. దీని వల్ల వాళ్లకు ఆ సమయంలో ఇమ్యూనిటీ స్థాయి పెరిగి ఉంటుందని భావిస్తున్నారు. సౌతాఫ్రికా సేకరించిన డేటాను విశ్లేషించాల్సి ఉందని సీడీసీ డైరక్టర్ జాన్ కెన్గాసోంగ్ తెలిపారు. ఒమిక్రాన్ వల్ల చనిపోయినవారిలో ఎక్కువ శాతం వ్యాక్సిన్ వేసుకోనివారే ఉన్నట్లు గుర్తించారు.