బీజింగ్: షాంఘైలో మళ్లీ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన మూడు నెలల్లో అత్యధిక స్థాయిలో నమోదు అయ్యాయి. దీంతో షాంఘై నగరంలో స్కూళ్లను మూసివేశారు. బుధవారం రోజున సిటీలో 47 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదు అయ్యాయి. జూలై 13 తర్వాత అత్యధిక స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు బీజింగ్‌లో తాజాగా 18 కేసులు నమోదు అయ్యాయి. షాంఘైలోని అయిదు జిల్లాల్లో ఎంటర్టైన్మెంట్ వేదికలను మూసివేశారు. సినిమా హాల్స్, బార్లు, జిమ్‌లను కూడా క్లోజ్ చేశారు.