డెల్టా..ఉల్టా… డెల్టా వేరియంట్‌పై సమర్థవంతంగా కొవాగ్జిన్

- ఆల్ఫా వేరియంట్ పైనా అంతే ప్రభావం
- అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ ప్రకటన
- టీకా వేసుకొన్న వారి సీరంపై పరిశోధనలు
- గణనీయంగా ఉత్పత్తైన యాంటిబాడీలు
- కొవాగ్జిన్ బూస్టర్‌తో దీర్ఘకాలం రక్షణ: ఎన్ఐవీ
వాషింగ్టన్, జూన్ 30: భారత్‌లో సెకండ్ వేవ్‌కు కారణమై, ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్ పై కొవాగ్జిన్ టీకా సమర్థవంతంగా పనిచేస్తున్నదని అమెరికా జాతీయ ఆరోగ సంస్థ(ఎన్ఐహెచ్) ప్రకటించింది. ఆల్ఫా వేరియంట్‌పై కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తున్నట్టు వెల్లడించింది. కొవాగ్జిన్ టీకాను హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధిపరిచి ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో తొలి స్వదేశీ కరోనా టీకాగా కొవాగ్జిన్‌కు పేరుంది. ఈ టీకా వేసుకొన్నవారి సీరంపై ఎన్ఐహెచ్ అధ్యయనం జరిపి ఆ వివరాలను బుధవారం వెల్లడించింది. ఆల్ఫా, డెల్టా వేరియంట్లను నిలువరించే యాంటిబాడీలు ఈ టీకాతో గణనీయంగా ఉత్పత్తి అవుతున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. ఇది రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతున్నట్టు ఎన్ఐహెచ్ తెలిపింది. కొవాగ్జిన్ మూడోదశ క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలు ఈ ఏడాది చివరికల్లా వెల్లడవుతాయని పేర్కొన్నది. మధ్యంతర ఫలితాలను బట్టి కొవాగ్జిన్ టీకా కరోనా వైరస్‌పై 78% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తేలింది. ఇదిలా ఉండగా, కొవాగ్జిన్ బూస్టర్ డోసుతో కరోనా నుంచి దీర్ఘకాలం రక్షణ లభించే అవకాశం ఉందని భారత్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) డైరెక్టర్ ప్రియ అబ్రహం అన్నారు. బూస్టర్ డోసుపై విదేశాల్లో ఇప్పటికే ప్రయోగాలు జరిగాయని, ఇండియాలో కూడా అలాంటి ప్రయోగాలు జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

