ఎవరెస్ట్‌కు చేరిన కరోనా.. నార్వే పర్వతారోహకుడికి పాజిటివ్

కాఠ్మండు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మమమ్మారి ఎవరెస్ట్‌కు ఎగబాకింది. ప్రపంచంలోనే ఎత్తైన పర్వత్వాన్ని కూడా వైరస్ చేరుకున్నది. నేపాల్‌లోని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న నార్వే దేశానికి చెందిన ఎర్లెండ్ నెస్‌కు కరోనా పాజిటివ్‌గా గురువారం నిర్ధారణ అయింది. దీంతో పర్వతంపైనున్న బేస్ క్యాంపు నుంచి అతడితోపాటు ఒక షెర్పాను హెలికాప్టర్లో కాఠ్మండులోని ఆసుసత్రికి తరలించారు. పరీక్షలో తమ ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఎర్లెండ్ నెస్ తెలిపారు. ప్రస్తుతం తనకు బాగానే ఉన్నదని ఆయన చెప్పారు.
ఎత్తైన ఎవరెస్ట్ పర్వతంపై మరెవరూ కరోనా బారిన పడకూడదని ఆశిస్తున్నట్లు నెస్ వెల్లడించారు. పర్వతాలపై గాలి పీల్చడం చాలా కష్టమని, అక్కడ కరోనా సోకితే పర్వతారోహకులకు చాలా ప్రమాదమని అన్నారు. అలాగే 8 వేల మీటర్ల ఎత్తులో ఉన్నవారిని అక్కడి నుంచి హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించడం కూడా కష్టసాధ్యమని తెలిపారు.
మరోవైపు ఈ సీజన్‌పై ఆశలు పెట్టుకున్న నేపాల్ ప్రభుత్వానికి ఈ ఘటన షాక్ ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది ఎవరెస్ట్ అధిరోహణ సీజన్ తుడుచుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎవరెస్ట్ అధిరోహకులు, టూరిస్ట్‌లకు క్వారంటైన్ నిబంధనలను నేపాల్ కాస్త సడలించింది. ఈ ఏడాది ఎవరెస్ట్ అధిరోహించేందుకు 377 మంది పర్వతారోహకులకు అనుమతి ఇచ్చింది. అయితే ఎవరెస్ట్‌పైనా కరోనా సోకిన ఘటన నేపాల్ ప్రభుత్వాన్ని కలవరపరుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
RC 17 | రామ్ చరణ్ ‘ఆర్సీ 17’పై మరో ప్రచారం.. గుజరాతీ బ్లాక్‌బస్టర్ రీమేక్ అంటూ టాక్స్..!
Amitabh Bachchan | బుల్లెట్ ప్రూఫ్ కవచం వెనుక అమితాబ్ బచ్చన్.. అభిమానుల కోసం భద్రత నడుమే ప్రత్యేక దర్శనం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

