న్యూయార్క్: కొవిడ్-19కు కారణమైన కరోనా వైరస్ వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) ల్యాబ్ నుంచి కాకుండా.. జంతువుల నుంచి మనుషులకు సోకినట్టు తాజా అధ్యయనం ఒకటి అభిప్రాయపడింది. వుహాన్‌లోని హౌనాన్ సీఫుడ్ మార్కెట్ నుంచే ఈ వైరస్ వ్యాపించినట్టు వెల్లడించింది. బ్రతికున్న జంతువులను విక్రయించే ఈ మార్కెట్లో 17 ఏండ్ల క్రితం కూడా ఈ తరహాలోనే సార్స్ వ్యాపించిందని పరిశోధకులు తెలిపారు. కరోనా కూడా ఇదే తరహాలో వ్యాపించినట్టు పేర్కొన్నారు. అయితే వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదని వెల్లడించారు.