ఐవర్‌మెక్టిన్‌తో కరోనా ఖతం!

- తరుచూ వాడితే వైరస్ కట్టడి సాధ్యం
- అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడి
- ‘ఐవర్‌మెక్టిన్’ వాడేందుకు గోవా గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ, మే 10: ప్రపంచదేశాల్ని కలవరపెడుతున్న కరోనాను అంతం చేయడంలో యాంటీ పారసైటిక్ ఔషధం ‘ఐవర్‌మెక్టిన్’ సమర్థవంతంగా పనిచేస్తున్నదని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఔషధాన్ని తరుచూ వినియోగించడం వల్ల కొవిడ్-19 బారిన పడే ప్రమాదం గణనీయంగా తగ్గవచ్చని పేర్కొంటున్నారు. ‘ఐవర్‌మెక్టిన్’ వాడటం ద్వారా కరోనాని సమూలంగా అంతం చేయవచ్చంటున్నారు. ఈ వివరాలు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్’ మే-జూన్ సంచికలో ప్రచురితమయ్యాయి. ‘ఐవర్‌మెక్టిన్‌తో కరోనాను కట్టడి చేయగలం. ఐవర్‌మెక్టిన్‌పై ఉన్న సమాచారాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి ఈ విషయాన్ని చెబుతున్నాం’ అని ఫ్రంట్‌లైన్ కొవిడ్-19 క్రిటికల్ కేర్ అలయన్స్ (ఎఫ్ఎల్సీసీసీ) ప్రెసిడెంట్ పియరే కోరి తెలిపారు. ఐవర్మెక్టిన్కి సంబంధించి 2,500 మంది రోగులపై చేసిన ప్రయోగాల్లో, మరో 27 ప్రత్యేక ట్రయల్స్‌లో ఈ విషయం స్పష్టమైందన్నారు. ‘ఐవర్‌మెక్టిన్’ సాయంతో చికిత్స తీసుకున్న కొవిడ్ రోగుల్లో మరణాల శాతం తగ్గిందని, కోలుకునే రేటు కూడా పెరిగిందని చెప్పారు. ఈ ఔషధాన్ని రోజూ వాడటం వల్ల రోగుల్లో వైరస్ లక్షణాలు కూడా తగ్గుతున్నట్టు గమనించామని వెల్లడించారు. రోగనిరోధక శక్తి పెరుగుదలకు, వైరస్ నియంత్రణకు ఈ ఔషధం మెరుగ్గా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. ‘కొవిడ్-19 చికిత్సకు ‘ఐవర్‌మెక్టిన్’ సమర్థమంతంగా పనిచేస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. కరోనా చికిత్సకు అన్ని దేశాలు ఈ ఔషధాన్ని సిఫారసు చేయాలి’ అని ఎఫ్ఎల్సీసీసీ వ్యవస్థాపక సభ్యుడు పౌల్ ఈ మారిక్ పేర్కొన్నారు.
లక్షణాలు లేకపోయినా వాడండి!
‘ఐవర్‌మెక్టిన్’ వాడకంతో కరోనాను నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొనడంతో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. 18 ఏండ్లు దాటిన వారందరూ ఐదు రోజులకు గానూ, ‘ఐవర్‌మెక్టిన్’ ఐదు మాత్రలను వాడొచ్చని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఔషధాన్ని అందుబాటులో ఉంచుతున్నట్టు వెల్లడించింది. కరోనా లక్షణాలు ఉన్నవారు, లేనివారు కూడా ఈ ఔషధాన్ని వాడొచ్చ ని ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి విశ్వజిత్ రాణె తెలిపారు. ‘ఐవర్‌మెక్టిన్’ 12ఎంజీని ఐదు రోజుల పాటు రోగులకు ఇస్తే వాళ్లు కోలుకునే అవకాశాలు ఉన్నాయన్నా రు. ‘ఐవర్‌మెక్టిన్’తో మరణాల రేటు తగ్గుతున్నట్టు బ్రిటన్, ఇటలీ, స్పెయిన్, జపాన్ పరిశోధకులు కూడా వెల్లడించారని గుర్తుచేశారు.
ఏమిటీ ‘ఐవర్‌మెక్టిన్’
పారసైట్ల (పరాన్నజీవుల) నుంచి వచ్చే వ్యాధులను నయం చేయడానికి ప్రధానంగా ‘ఐవర్‌మెక్టిన్’ ఔషధాన్ని వినియోగిస్తారు. నోటి ద్వారా తీసుకునే ఈ ఔషధాన్ని వైద్యుల సిఫారసు మేరకు వాడాలి.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- corona
- iver
- Ivermectin
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

