Psychological Stress | లండన్: రాత్రిపూట తరచుగా 5 గంట ల కంటే తక్కువసేపు నిద్రపోవడం వల్ల మానసిక ఒత్తిడి ముప్పు పెరుగుతుందని జన్యుపరమైన అధ్యయనంలో వెల్లడైంది. నిద్ర వ్యవధితోపాటు మానసిక ఒత్తిడికి సంబంధించిన లక్షణాలు ఒక తరం నుంచి మరో తరానికి పాక్షికంగా సంక్రమిస్తాయని లండన్ యూనివర్సిటీ కాలేజీ (యూఎల్సీ) పరిశోధకులు తెలిపారు.
తక్కువ నిద్ర అనేది మానసిక ఒత్తిడి లక్షణాల ఆగమనంతో ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. సగటున 65 ఏండ్ల వయసున్న 7,146 మంది వ్యక్తుల నుంచి సేకరించిన జన్యు, ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి వీరు ఈ విషయాలను తేల్చారు.