మిచిగాన్: క్యాన్సర్లలో పెద్దపేగు క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది. అయితే, దీని గుట్టును విప్పారు అమెరికా పరిశోధకులు. అధికస్థాయి అమ్మోనియా వల్ల క్యాన్సర్‌తో పోరాడే టీ సెల్స్ సంఖ్య తగ్గిపోతున్నదని గుర్తించారు. ఎలుకలపై పరిశోధన నిర్వహించి, ఈ విషయాన్ని తేల్చారు. అమ్మోనియం స్థాయిలు ఇమ్మునోథెరపీ నిరోధకతపై ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. ఫలితంగా కణితులు పెరిగిపోతున్నట్టు కనుగొన్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదిత డ్రగ్స్‌ను ఉపయోగించి అమ్మోనియా స్థాయిలను తగ్గిస్తే క్యాన్సర్ కణితుల పరిమాణం తగ్గిపోతుందని తేల్చారు.