న్యూయార్క్: పరిశోధకుల ఓ ఉమ్మడి ప్రయత్నం ఔషధ రసాయనశాస్త్రంలో కార్బన్ డయాక్సైడ్ను లబ్ధిదాయకంగా వినియోగించుకొనే వినూత్న పద్ధతికి దారితీసింది. కార్బన్ డయాక్సైడ్ను శుద్ధి చేసి.. కార్బన్ను ఉపయోగపడే అణువులుగా రూపాంతరం చెందించే పరీక్ష విజయవంతమైంది.
ఇందుకు చైనాలోని సిచువాన్ యూనివర్సిటీకి చెందిన పోస్ట్ డాక్టోరల్ పరిశోధకులు పెంగ్ యు, వెన్ ఝాంగ్, జువో క్వాన్ ఎలక్ట్రోసింథసిస్ అనే పద్ధతిని వినియోగించారు. దీని ద్వారా కార్బన్ అణువులను ఫార్మాస్యూటికల్స్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించే ఆర్గానిక్ అణువులుగా మార్చారు. ఈ మేరకు పరిశోధన వివరాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.