ప్లాస్టిక్ వ్యర్థాలతో జెట్ ఇంధనం.. హైడ్రోజన్- సింగిల్ ఆటమ్ ఉత్ప్రేరకాలతో అభివృద్ధి
చైనాకు చెందిన నాంజిగ్ ఫారెస్ట్రీ యూనివర్శిటీ, త్సింగ్‌హువా యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ప్లాస్టిక్ వ్యర్థాలతో జెట్ ఇంధనానికి సమానమైన ఇంధనాన్ని అభివృద్ధి చేశారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన వీరి అధ్యయనం ప్రకారం ఈ కొత్త ప్రక్రియ హైడ్రోజన్ సమక్షంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేస్తుంది.
బీజింగ్ : చైనాకు చెందిన నాంజిగ్ ఫారెస్ట్రీ యూనివర్శిటీ, త్సింగ్‌హువా యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ప్లాస్టిక్ వ్యర్థాలతో జెట్ ఇంధనానికి సమానమైన ఇంధనాన్ని అభివృద్ధి చేశారు. నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన వీరి అధ్యయనం ప్రకారం ఈ కొత్త ప్రక్రియ హైడ్రోజన్ సమక్షంలో అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్లాస్టిక్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. సింగిల్ అటామిక్ ఉత్ప్రేరకాల యుగంలోకి ప్రవేశించినప్పటి నుంచి తమ బృందం ఉత్ప్రేరక దృక్కోణంలో ప్లాస్టిక్ హైడ్రోజనోలిసిస్ ప్రక్రియలపై పరిశోధనలు చేస్తోందని ఈ పరిశోధనా పత్రం సహ రచయితలు, ప్రొఫెసర్లు యాడాంగ్ లీ, డింగ్షెంగ్ వాగ్లు ‘టెక్ ఎక్స్‌ఫ్లోర్’కి తెలిపారు.
సంప్రదాయ ప్లాస్టిక్ హైడ్రోజనేషన్ అనేది నియంత్రించడానికి వీల్లేని విధంగా విస్తృత ఉత్పత్తులను ఇస్తుంది. పరమాణు స్థాయిలో యాక్టివ్ సెంటర్‌ను డిజైన్ చేయడం ద్వారా నాణ్యమైన జెట్ ఇంధనం తయారు చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. అనేక ఉత్ప్రేరకాలను పరిశీలించిన తరువాత కో ఏఐ ఆక్సైడ్‌పై ఉన్న ఐసోలేటెడ్ రుథేనియం సైట్లు సాధారణ వాతావరణ పీడనం వద్ద ైస్టెరిన్‌ను ఇథైల్ సైక్లో హెక్సేన్గా మార్చగలమని కనుగొన్నామని లీ, వాంగ్ వివరించారు. ప్లాస్టిక్ నుంచి లభించిన జెట్ ఇంధనం ఆకర్షణీయమైన ఇంధన లక్షణాలను కలిగి ఉండటం తమను ఆశ్చర్యపరిచిందన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ED Charge Sheets | వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ 9 ఛార్జీషీట్లు దాఖలు
డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

