ముప్పు తప్పింది!
- హిందూ మహా సముద్రంలో కూలిన చైనా రాకెట్
- మాల్దీవులకు సమీపంలోనే రాకెట్ శకలాలు
- చైనాది బాధ్యతారాహిత్యం.. నాసా మండిపాటు

బీజింగ్, మే 9: కొన్ని రోజులుగా ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేసిన చైనా రాకెట్ ‘లాంగ్ మార్చ్ 5బీ’ శకలాలు ఆదివారం హిందూమహా సముద్రంలో కూలాయి. శకలాలు కూలిన ప్రాంతం మాల్దీవులకు సమీపంలో ఉన్నది. ఆదివారం ఉదయం 10.24 గంటలకు రాకెట్ శకలాలు భూ వాతావరణంలోకి ప్రవేశించినట్టు చైనా మ్యాన్డ్ స్పేస్ ఇంజినీరింగ్ కార్యాలయం తెలిపింది. వాతావరణంలోకి ప్రవేశించగానే చాలా వరకు శకలాలు మండిపోయాయని, మిగతావి 72.47 డిగ్రీల తూర్పు రేఖాంశం, 2.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం కలిసే ప్రాంతంలోని సముద్ర జలాల్లో పడ్డట్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఏ రకమైన ప్రమాదం జరుగలేదని వివరించింది. మరోవైపు, రాకెట్ శకలాలు నివాసిత ప్రాంతాల్లో పడినట్లయితే పరిస్థితి ఏంటని ‘నాసా’ మండిపడింది. రాకెట్ ప్రయోగం, నిర్వహణలో చైనా బాధ్యతారాహిత్యంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాకెట్ శకలాలు సముద్రంలో కూలుతున్నాయని పేర్కొంటూ కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

