బీజింగ్, డిసెంబర్ 31: మరో రెండు వారాల్లో తైవాన్ కొత్త నాయకుడిని ఎన్నుకోబోతున్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో తైవాన్ భాగం కావడం అనివార్యమని చెప్పారు. ఆదివారం కొత్త సంవత్సర సందేశంలో ఆయన ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్య పాలన కొనసాగుతున్న తైవాన్‌పై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించడానికి ఆ దేశంపై చైనా సైనిక ఒత్తిడిని ప్రయోగిస్తున్నది. అయితే సయోధ్య కోసం తైవాన్ అధ్యక్షుడు త్సాయ్ ఇంగ్-వెన్, ఉపాధ్యక్షుడు లై చింగ్-టె చర్చలకు పిలుపునిచ్చినా చైనా తిరస్కరించింది.