వైరస్ ఆనవాళ్లు చెబితే 15వేల డాలర్లు ఇస్తాం.. నజరానా ప్రకటించిన చైనా నగరం

బీజింగ్: చైనాలోని హీలాంగ్జియాంగ్ ప్రావిన్సు కరోనా వైరస్‌పై ప్రజాయుద్ధాన్ని ప్రకటించింది. రష్యాతో సరిహద్దుల్లో ఉన్న హీహే నగరం తాజాగా ఓ ప్రకటన చేసింది. కొత్తగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తిస్తే వారికి లక్ష యువాన్లు(15,500 డాలర్లు) ఇస్తామని ఆ నగరం ప్రకటించింది. ఎక్కడ నుంచి వైరస్ వ్యాపించింది, ఎలా ఆ వైరస్ ప్రబలుతోందన్న అంశాలను తేల్చేందుకు స్థానిక ప్రభుత్వం ఆ నజరానా ప్రకటించింది. ఇటీవల చైనాలో డెల్టా వేరియంట్‌కు చెందిన కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా మళ్లీ తీవ్ర స్థాయిలో ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు దాని ఆనవాళ్లను గుర్తించాలని హీహే నగరం భావిస్తోంది. దీనికి సంబంధించి ఆదివారం ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సాధారణ ప్రజలు సహకరించాలని, దర్యాప్తునకు ఆధారాలు సమర్పించాలని ఆ ప్రకటనలో కోరారు. అతి విలువైన సమాచారాన్ని ఇస్తే, వైరస్ పుట్టుక గురించి తెలుస్తుందని ప్రభుత్వం ఆ ప్రకటనలో చెప్పింది. అయితే ఎవరైనా కావాలనే సమాచారాన్ని దాచిపెడితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జంతువుల స్మగ్లింగ్, అక్రమ వేట, సరిహద్దుల్లో చేపల వేటకు వెళ్లడం లాంటివి ఎవరైనా చేస్తే, వాటి గురించి తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది.
అక్టోబర్ ఒకటి తర్వాత ఆన్లైన్లో వస్తువులు కొన్నవారు, ఆ వస్తువులను డిస్ఇన్ఫెక్ట్ చేయాలని సూచించింది. వాటిని వైరస్ టెస్టింగ్ కోసం కూడా ప్రభుత్వ సెంటర్‌కు పంపాలన్నది. కరోనా మహమ్మారితో సతమతమైన దేశాల నుంచి ఎటువంటి వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేయవద్దు అని సూచించారు. లాజిస్టిక్స్, కొరియర్ కంపెనీలు తమ వద్దకు వచ్చిన పార్సిళ్లను ఒకేవద్ద ఉంచాలని, వాటిని ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

